Hruthik Roshan KGF 3: యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'కేజీయఫ్ 2'. భారీ అంచనాలతో ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. బ్లాక్ బస్టర్ టాక్‌ను సొంతం చేసుకొని రూ.1200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ క్రమంలో 'కేజీయఫ్ 3' గురించి చర్చ మొదలైంది. తాజాగా ఈ స్వీక్వెల్ కోసం హృతిక్ రోషన్‌ను చిత్రబృందం సంప్రదించిందని.. 'కేజీయఫ్ 3'లో హృతిక్ నటించనున్నారన్న వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై నిర్మాత విజయ్ కిరంగదూర్ స్పందించారు.
"కేజీయఫ్ 3 ఈ సంవత్సరం ఉండదు. మేము దీని కోసం కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ 'సలార్' సినిమాతో బిజీగా ఉన్నారు. త్వరలోనే యశ్ తన కొత్త సినిమాని ప్రకటించనున్నారు. వాళ్లకు సమయం దొరికినప్పుడు 'కేజీయఫ్'కు సంబంధించిన పనులు ప్రారంభిస్తాం. ప్రస్తుతానికి ఛాప్టర్ 3 ఎప్పుడు ప్రారంభమవుతుందనేది చెప్పలేదు. మేము ఈ సినిమా పనులు మొదలుపెట్టాక అందులో ఎవరెవరు నటిస్తున్నారో చెబుతాము. అప్పుడు ఎవరు అవసరమైతే వారిని సంప్రదిస్తాం" అంటూ రూమర్స్‌కు చెక్‌పడేలా 'కేజీయఫ్ 3' నిర్మాత సమాధానం ఇచ్చారు.
ఇవీ చదవండి: పాపం బోనీ కపూర్.. లక్షలు స్వాహా చేసిన దుండగులు!
F3 సక్సెస్ సెలబ్రేషన్స్.. 'విక్రమ్' సాంగ్ రిలీజ్.. 'బ్రహ్మాస్త్ర' ప్రోమో