ETV Bharat / entertainment

'ఆర్​ఆర్​ఆర్'​ షూటింగ్​లో ఆ సమస్యతో జక్కన్న చాలా ఇబ్బంది పడ్డారట - ఆర్​ఆర్​ఆర్​ రాజమౌళి ఆరోగ్యం

ఆర్​ఆర్​ఆర్​ సినిమా సమయంలో దర్శకధీరుడు రాజమౌళి ఆ సమస్యతో చాలా ఇబ్బంది పడ్డారని చెప్పింది హీరోయిన్ శ్రియ. ఏంటంటే?

Heroine Sriya about director rajamouli
'ఆర్​ఆర్​ఆర్'​ షూటింగ్​లో ఆ సమస్యతో జక్కన్న చాలా ఇబ్బంది పడ్డారట
author img

By

Published : Dec 2, 2022, 12:49 PM IST

ఒక సినిమా రూపొందాలంటే దాని వెనక వందల మంది కష్టం, శ్రమ దాగి ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు, సమస్యలు వచ్చినా లెక్కచేయకుండా ప్రేక్షకులను అలరించడం కోసం ఎంతో శ్రమిస్తుంది చిత్రబృందం. ఆరోగ్య సమస్యలు ఉన్నా సినిమా హిట్‌ అయితే అన్ని మర్చిపోతారు. సినిమా విజయంలో తెర ముందు హీరోలు నటీనటులైతే.. తెరవెనుక హీరోలు చాలా మంది ఉంటారు. అసలు విషయమేమిటంటే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు మందు దర్శకదిగ్గజం రాజమౌళి ఆరోగ్యసమస్యతో ఇబ్బంది పడ్డారట. ఈ విషయాన్ని స్టార్‌ హీరోయిన్‌ శ్రియ ఇటీవల ఓ ప్రముఖ మీడియా ఛానల్‌కు వెల్లడించింది.

"నాకు తెలిసినంత వరకు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రారంభానికి ముందు రాజమౌళి గారు ఆస్తమాతో బాధపడ్డారు. అయినా ఆయన ఏమీ పట్టించుకోలేదు. ఆయన దృష్టి అంతా కథను ఎలా ప్రజెంట్‌ చేయాలి అనే దాని మీదే ఉంటుంది. సెట్‌ అంతా దుమ్ము ఉన్నా అలానే వర్క్‌ చేస్తారు. తెరపై సినిమా అద్భుతంగా ఉండాలని తాపత్రయపడతారు" అంటూ జక్కన్న సినిమా అంటే ఎంత ఇష్టమో చెప్పింది శ్రియ.

ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా వసూళ్ల పరంగానే కాదు అవార్డులోనూ రికార్డులు సృష్టిస్తోంది. జాతీయ, అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా సన్‌సెట్‌ సర్కిల్‌ అవార్డు (Sunset Circle Awards)ల్లో ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగంలో 'ఆర్‌ఆర్‌ఆర్‌' విజేతగా నిలిచింది. అలాగే శాటర్న్‌ అవార్డు ఈ ఏడాది ఆర్‌ఆర్‌ఆర్‌ను వరించింది.

ఇదీ చూడండి: నా కూతురి పెళ్లికి పవన్​కల్యాణ్​ అందుకే రాలేదు: అలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.