ETV Bharat / entertainment

మళ్లీ హాస్పిటల్​లో చేరిన సమంత.. ఫ్యాన్స్​కు టెన్షన్​.. అసలేమైంది? - సమంత హెల్త్ కండిషన్

గత కొద్ది రోజులగా మయోసైటిస్​ వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్ సమంత మళ్లీ హాస్పిటల్​లో చేరింది. బెడ్​పై ట్రీట్​మెంట్​ తీసుకుంటున్న ఫొటోను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Samantha in hospital
మళ్లీ హాస్పిటల్​లో చేరిన సమంత.. ఫ్యాన్స్​కు టెన్షన్​.. అసలేమైంది?
author img

By

Published : Apr 27, 2023, 2:59 PM IST

Updated : Apr 27, 2023, 3:10 PM IST

టాలీవుడ్​లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్​గా ఎదిగింది సమంత. తన క్యూట్​ ఫేస్​ అండ్ యాక్టింగ్​తో యూత్​ను అట్రాక్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నాయక ప్రాధాన్యత చిత్రాల్లో నటిస్తూ మరింత స్టార్​డమ్​ను అందుకుంది. అయితే ఆ మధ్యలో ఆమె మయోసైటిస్​అనే వ్యాధితో చాలా బాధపడింది. సినిమాలకు కొద్ది రోజుల పాటు బ్రేక్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత ట్రీట్​మెంట్​ తీసుకుంటూనే.. వరుస సినిమా షూటింగ్​లలో పాల్గొంది. అలా బౌన్స్ బ్యాక్ అయిన సామ్​.. మళ్లీ వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్​లో ముందుకెళ్తోంది.

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ముఖానికి ఓ ఆక్సిజన్​ మాస్క్ ధరించి.. హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ తీసుకుంటూ కనిపించింది. సోషల్ మీడియాలో సమంత పోస్ట్ చేసిన ఈ ఫొటో కాసేపట్లో వైరల్​గా మారింది. ఇది చూసిన అభిమానులు షాక్​కు గురి అవుతున్నారు. ధైర్యంగా ఉండాలని ఆమెను సపోర్ట్​ చేస్తున్నారు. అయితే తాను హైపర్ బేరిక్ థెరపీని తీసుకుంటున్నట్లుగా సామ్​ చెప్పుకొచ్చింది. శరీరంలోని పలు వ్యాధులకు ఈ థెరపీ బాగా పని చేస్తుందని.. గూగుల్​లో ఈ థెరపీ గురించి సెర్చ్ చేసిన స్క్రీన్​షాట్​ను షేర్ చేసింది.

Samantha
మళ్లీ హాస్పిటల్​లో చేరిన సమంత

సిటాడెల్​తో బిజీ.. ఇకపోతే ప్రస్తుతం వరుస లేడీ ఒరియెంటెడ్ సినిమాలు చేస్తున్న సమంత.. రీసెంట్​గా భారీ ప్రాజెక్ట్​తో విజువల్ ట్రీట్​గా రూపొందిన​ 'శాకుతంలం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏప్రిల్ 14న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలై ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ తెరకెక్కించిన ఈ సినిమాలోని గ్రాఫిక్​ విజువల్స్, హీరోహీరోయిన్​ కెమిస్ట్రీపై నెగెటివిటీ వచ్చింది. ఈ సినిమా ఫలితం పక్కనపెడితే.. సమంత క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. 'సిటాడెల్' అనే వెబ్ సిరీస్​లో నటిస్తోంది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇంటర్నేషనల్​ సిరీస్​కు ఇండియన్ వెర్షన్​లో సమంత లీడ్​ రోల్​ చేస్తోంది. ప్రముఖ దర్శక ద్వయం రాజ్​ అండ్​ డీకే దీన్ని డైరెక్ట్​ చేస్తున్నారు. బాలీవుడ్​ హీరో వరుణ్​ ధావన్​ కూడా ఈ సిరీస్​లో నటిస్తున్నారు.

సమంతకు గుడి.. ఈ ముద్దుగుమ్మకు ఉన్న ఫ్యాన్స్​, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఓ వీరాభిమాని సమంతకు ఏకంగా గుడి కట్టించి తన అభిమానం చాటుకున్నాడు. బాపట్ల జిల్లా చుండూరు మండలం అలపాడుకు చెందిన సందీప్​ అనే వ్యక్తి.. తన ఇంటి ప్రాంగణంలో సామ్​కు ఓ చిన్నపాటి గుడి కట్టిస్తున్నాడు. ఇప్పటికే సమంత విగ్రహం కూడా తయారు చేయించాడు. ఏప్రిల్ 28 సామ్ పుట్టినరోజు సందర్భంగా ఆలయాన్ని ప్రారంభించనున్నాడు.

Samantha
మళ్లీ హాస్పిటల్​లో చేరిన సమంత.. ఫ్యాన్స్​కు టెన్షన్​.. అసలేమైంది?

ఇదీ చూడండి: ఓటీటీలో 'దసరా'.. 'ప్రియాంక సిటాడెల్'​ రిలీజ్ ఆ రోజే..

Last Updated : Apr 27, 2023, 3:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.