ETV Bharat / entertainment

'కొన్నిసార్లు తిరుగుబాటు అవ‌స‌రమే'.. 'RC 16' అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ వచ్చేసిందోచ్​.. - రామ్​చరణ్​ బుచ్చిబాబు

RC16 Announcement: హీరో రామ్​చరణ్​, ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు క‌ల‌యిక‌లో రూపొందనున్న పాన్ ఇండియ‌న్ సినిమాను సోమ‌వారం అధికారికంగా అనౌన్స్‌చేశారు. ప‌వ‌ర్‌ఫుల్ స‌బ్జెక్ట్‌తో ఈ సినిమా తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

RC16 Announced
RC16 Announced
author img

By

Published : Nov 28, 2022, 11:54 AM IST

RC16 Announcement: మెగా పవర్​ స్టార్​ రామ్‌చ‌ర‌ణ్ 16వ సినిమాను సోమ‌వారం అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. ఈ సినిమాకు బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఉప్పెన సినిమాతో ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన బుచ్చిబాబు రెండో సినిమాతోనే బంప‌ర్​ఆఫ‌ర్‌ను అందుకున్నారు. కొన్నిసార్లు తిరుగుబాటు అవ‌స‌రమంటూ ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌పై ఉన్న క్యాప్ష‌న్‌ ఆస‌క్తి పెంచుతోంది. ప‌వ‌ర్‌ఫుల్ స‌బ్జెక్ట్‌తో పాన్ ఇండియ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొంద‌నున్న‌ట్లు మేకర్స్​ తెలిపారు.

జ‌న‌వ‌రి నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభంకానున్న‌ట్లు స‌మాచారం. మైత్రీ మూవీ మేక‌ర్స్ స‌మ‌ర్ఫ‌ణ‌లో సుకుమార్ రైటింగ్స్‌, వృద్ధి సినిమాస్ ప‌తాకాల‌పై వెంక‌ట స‌తీష్ కిలారు ఈ పాన్ ఇండియ‌న్ సినిమాను నిర్మించ‌బోతున్నారు. క‌థానాయిక‌తో పాటు మిగిలిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల్ని త్వ‌ర‌లో వెల్ల‌డించే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు.

hero ramcharan director buchi babu pan india movie officially announced
మైత్రీ మూవీ మేకర్స్​ ట్వీట్​

తొలుత త‌న 16వ సినిమాను జెర్సీ ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరితో చేయ‌బోతున్న‌ట్లు రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌క‌టించారు. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈ ప్రాజెక్ట్ వ‌ర్క‌వుట్ కాలేదు. ఆయన స్థానంలో బుచ్చిబాబుతో సినిమా చేయబోతున్నారు చెర్రీ. మ‌రోవైపు ఉప్పెన త‌ర్వాత బుచ్చిబాబు కూడా ఎన్టీఆర్‌తో సినిమా చేయ‌నున్నట్లు ప్ర‌చారం జ‌రిగింది. కానీ కొర‌టాల శివ‌, ప్ర‌శాంత్ నీల్​తో ఎన్టీఆర్ క‌మిట్‌మెంట్స్ ఉండ‌టంతో రెండేళ్ల వ‌ర‌కు డేట్స్ దొర‌క‌డం క‌ష్ట‌మే. అందుకే రామ్‌చ‌ర‌ణ్ సినిమాకు బుచ్చిబాబు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.