Vikram Health bulletin: ఛాతిలో అసౌకర్యంగా ఉండటం వల్ల ఆస్పత్రిలో చేరిన తమిళ స్టార్ హీరో విక్రమ్ డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆయనే స్వయంగా మాట్లాడుతూ కనిపించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు చెప్పారు. తనపై ప్రేమ, అభిమానం చూపించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇంతమంది ప్రేమ కనబరచడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అయితే ఈ వీడియోపై స్పందిస్తున్న.. ఆయన కోలుకోవడం ఆనందంగా ఉందంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని.. ఆ తర్వాత సినిమా షూటింగ్స్‌లో పాల్గొనాలంటూ సూచిస్తున్నారు.
-
#ChiyaanVikram Sir is Discharged for today !♥️🙏🏽
— ChiyaanMathanCvf (@mathanotnmcvf) July 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Waiting to see #CobraAudioLaunch pic.twitter.com/oDUPlJmebl
">#ChiyaanVikram Sir is Discharged for today !♥️🙏🏽
— ChiyaanMathanCvf (@mathanotnmcvf) July 9, 2022
Waiting to see #CobraAudioLaunch pic.twitter.com/oDUPlJmebl#ChiyaanVikram Sir is Discharged for today !♥️🙏🏽
— ChiyaanMathanCvf (@mathanotnmcvf) July 9, 2022
Waiting to see #CobraAudioLaunch pic.twitter.com/oDUPlJmebl
ఇదీ జరిగింది.. విక్రమ్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు శుక్రవారం మధ్యాహ్నం వార్తలు వచ్చాయి. ఆయనకు గుండెపోటు వచ్చిందని, పరిస్థితి విషమంగా ఉందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే.. ఈ వార్తల్లో నిజం లేదని విక్రమ్ సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. అలానే ఇదే విషయాన్ని విక్రమ్ జాయిన్ అయిన చెన్నైలోని కావేరి ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. ఛాతిలో అసౌకర్యంగా ఉన్నందునే ఆయన హాస్పిటల్‌కు వచ్చారని చెబుతూ శుక్రవారం సాయంత్రం మెడికల్ బులెటిన్ విడుదల చేశారు. విక్రమ్‌ను పరీక్షించి, అవసరమైన చికిత్స చేస్తున్నారని వివరించారు. మరోవైపు... విక్రమ్ ఆస్పత్రిలో చేరారన్న వార్త తెలుసుకుని ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
'అపరిచితుడు' చిత్రంతో విక్రమ్ తెలుగువారికి ఎంతో చేరువయ్యారు. ఆ తర్వాత ఆయన నటించిన చిత్రాలు ఇక్కడా విడుదలై మన వారిని బాగా అలరించాయి. ప్రస్తుతం ఆయన 'కోబ్రా', మణిరత్నం దర్శకత్వంలో 'పొన్నియిన్ సెల్వన్' చిత్రాల్లో నటిస్తున్నారు.
ఇదీ చూడండి: గుండెపోటా? జ్వరమా? చియాన్ విక్రమ్ హెల్త్‌పై క్లారిటీ ఇచ్చిన డాక్టర్లు