ETV Bharat / entertainment

చిరు 'గాడ్​ఫాదర్​'లో హీరోయిన్​ ఆమెనే.. పోస్టర్​తో క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్​ - లేడీ సూపర్​స్టార్​ నయన​తార అప్డేట్స్​

మెగాస్టార్​ చిరంజీవి నటిస్తున్న 'గాడ్​ ఫాదర్'​ మూవీలో కథానాయిక గురించి గత కొద్ది రోజులుగా ఆద్యంతం చర్చ జరుగుతోంది. అయితే ఈ సస్పెన్స్​ను తెరదించుతూ ఓ పోస్టర్​తో క్లారిటీ ఇచ్చింది మూవీ టీమ్​.

herione nayantharas-first-look-in-chiranjeevi-godfather movie

author img

By

Published : Sep 8, 2022, 1:58 PM IST

Nayanthara first look in Godfather : మెగాస్టార్​ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'గాడ్​ ఫాదర్'​ మూవీలో నటిస్తున్న హీరోయిన్​ ఫస్ట్​ లుక్​ విడుదలైంది. ఈ మూవీలో లేడీ సూపర్​ స్టార్​ నయనతార హీరోయిన్​గా నటిస్తున్నారని ఊహగానాలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ చిత్ర బృందం పోస్టర్​ రిలీజ్​ చేసింది.'సత్య ప్రియ జయదేవ్' ​అనే పాత్రలో ఆమె నటించనున్నారని తెలిపింది. పోస్టర్​లో సంప్రదాయబద్దమైన కాటన్​ చీరలో నయన్​ కనిపించారు. టైప్​ రైటర్​పై ఏదో రాస్తునట్లుగా ఉన్న ఆ పోస్టర్​ను చూసిన అభిమానులు ఈ పాత్రకు నయన్​ కరెక్ట్​ ఛాయిస్​ అని కామెంట్లు పెడుతున్నారు.

Nayanthara first look in 'Godfather'
'సత్య ప్రియ జయదేవ్'గా నయనతార

లేడీ సూపర్​స్టార్​గా సౌత్​ ఫిలిం ఇండస్ట్రీలో సుపరిచితురాలైన నయన్..​ తాజాగా దర్శకుడు విఘ్నేశ్​ శివన్​ను వివాహం చేసుకున్నారు. పెళ్లైన తర్వాత ఆమె నటించనున్న ప్రాజెక్టుల్లో గాడ్​ ఫాదర్​ ఒకటి కావడం విశేషం. ఈ మాస్​ ఎంటటైనర్​ మూవీలో కండల వీరుడు సల్మాన్ గెస్ ట్​రోల్​లో అలరించనున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. మరో కీలక విషయమేమిటంటే ఈ సినిమాలో దర్శకుడు పూరీ జగన్నాథ్​, నటుడు సత్యదేవ్​ సైతం నటిస్తున్నారు. మెగాస్టార్​ సతీమణి కొణిదెల సురేఖ ఈ చిత్ర నిర్మాతగా వ్యవహరించగా, మోహన్​రాజా దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదీ చదవండి: ఆ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్న హీరో నాగార్జున!

ఎన్టీఆర్​ ఎన్ని భాష‌ల్లో అవ‌లీల‌గా మాట్లాడ‌గ‌ల‌రో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.