RC15 On Location Photos Viral: 'RC 15' షూటింగ్‌తో బిజీగా ఉన్నారు రామ్‌చరణ్, కియారా అద్వానీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్‌లో జరుగుతోంది. నాయకానాయికలపై ఓ రొమాంటిక్ డ్యూయెట్‌ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శంకర్. బుధవారం నుంచి డ్యూన్‌డీన్‌సిటీ బీచ్‌తో పాటు సముద్ర తీర ప్రాంతాల్లోని బ్యూటీఫుల్ లొకేషన్స్‌లో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ గ్యాప్‌లో టీమ్ మెంబర్స్‌తో కలిసి సరదాగా గడుపుతున్న ఫొటోలను కియారా సోషల్ మీడియాలో షేర్ చేసింది. మొదటి ఫొటోలో చరణ్‌తో కలిసి బర్గర్ లాగిస్తూ కియారా కనిపిస్తోంది.
మరో ఫొటోలో టీమ్ అంతా కనిపించారు. ఇందులో రామ్‌చరణ్, కియారాతో పాటు డ్యాన్స్ మాస్టర్ బాస్కో మార్టీస్, అలీమ్ హకీమ్ తదితరులు ఉన్నారు. కియారా షేర్ చేసిన ఈ ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను ఉద్దేశిస్తూ బర్గర్స్ విత్ దేస్ బగ్గర్స్ అంటూ ట్వీట్ చేసింది. కొన్ని కారణాల వల్ల తన పోస్ట్ నుంచి ఆ పదాలను తొలగించింది. తర్వాత సాంగ్ షూట్ కోసం డైట్‌లో ఉన్నామంటూ పేర్కొనంది. కియారా పోస్ట్ చేసిన ఫొటోలను ఉద్దేశించి రామ్‌చరణ్ సతీమణి ఉపాసన స్పందించింది. అందరిని మిస్ అవుతున్నట్లుగా పేర్కొంది.
పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియన్ స్థాయిలో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు. నవీన్‌చంద్ర, సునీల్, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు.