ETV Bharat / entertainment

తీసినోడు నా కొడుకు - 'హనుమాన్' దర్శకుడి తండ్రి వీడియో వైరల్​ - గర్వపడుతున్న ప్రశాంత్ వర్మ తండ్రి

Hanuman Movie Prasanth Varma Father : కొడుకు విజయం సాధిస్తే తండ్రి ఎంత గర్వంగా భావిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంతోషంతో ఉబ్బితబ్బిబైపోయి 'నా కొడుకు' అని ఎంతో గర్వంగా అందరితో చెప్పుకుంటుంటారు. ఇప్పుడా పుత్రోత్సాహంలోనే ఉన్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ తండ్రి. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 14, 2024, 9:57 AM IST

Hanuman Movie Prasanth Varma Father : ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న పేరు ప్రశాంత్ వర్మ. ఎందుకంటే ఆయన తెరకెక్కించిన 'హనుమాన్'(Hanuman Review) సినిమా దేశవ్యాప్తంగా సెన్సేషనల్​ టాక్​ను అందుకుంటోంది. భారీ వీఎఫ్ఎక్స్, విజువల్స్​తో సినిమా తీయాలంటే వందల కోట్లు కావాలి! కానీ ప్రశాంత్ వర్మ అతి తక్కువ బడ్జెట్​తోనే భారీ సినిమా చేసి నేషనల్ వైడ్‌గా సెన్సేషన్ అవుతున్నారు.

దీంతో హనుమాన్ చిత్రం విజయాన్ని​ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తప్ప ఇతర టాప్ స్టార్లు ఎవ్వరూ హనుమాన్‌ గురించి ఇంకా మాట్లాడనే లేదు కానీ అంతలోనే మూవీ లవర్స్, ఆడియెన్స్ హనుమాన్​ను భుజానికి ఎత్తుకుని ఊరేగిస్తున్నారు. దీంతో థియేటర్లు లేకపోయినా అదిరిపోయే టాక్​ను సొంతం చేసుకున్న హనుమాన్​ ఇప్పుడు స్క్రీన్ల సంఖ్యను పెంచుకుంటూ దూసుకుపోతోంది. ఓవర్సీస్​లోనూ మంచి ఓపెనింగ్స్​ను అందుకుని వసూళ్లను ఖాతాలో వేసుకుంటోంది.

అయితే తక్కువ బడ్జెట్​తో అద్భుతమైన వీఎఫ్​ఎక్స్​, కంటెంట్​ను చూసిన ప్రతిఒక్కరూ దర్శకుడు ప్రశాంత్​ వర్మపై భారీగా ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి అంతటి బ్లాక్ బస్టర్ సినిమాను తీసిన ప్రశాంత్ వర్మ తండ్రి ఏ రేంజ్​లో హ్యాపీగా ఫీల్ అవుతున్నారో ఓ వీడియో బయటకు వచ్చింది. ఆయన సాధారణ ప్రేక్షకుడిలా ఓ థియేటర్​లో సినిమా చూసి బయటకు వచ్చారు. అయితే ఆయనే ప్రశాంత్ వర్మ తండ్రి అని తెలియని కొంతమంది రిపోర్టర్లు కెమెరాలు పెట్టి సినిమా ఎలా ఉందని అడగటంతో - తానే ప్రశాంత్ వర్మ తండ్రి, గొప్పగా భావిస్తున్నాను అంటూ ఆనందాన్ని పంచుకున్నారు. హనుమాన్ తీసినోడు నా కొడుకు అని గర్వంగా చెప్పుకున్నారు.

ఈ సినిమా ఎలా అనిపించిందని అని అడగగా అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ప్రతీ పాత్ర బాగుందని, అందరూ బాగా నటించారని చెప్పుకొచ్చారు. నెక్ట్స్ ఏకంగా హనుమాన్ మీదే సినిమా వస్తుందని అంచనాలు పెంచేశారు. సినిమా చూశాక తొలిసారి ఇలాంటి ఫీలింగ్ కలిగిందంటూ గర్వపడ్డారు. కొడుకు విజయాన్ని చూసి గర్వ పడుతున్న తండ్రి ఆనందం ఆ కళ్లలో కనిపిస్తుందంటూ నెటిజన్లు ఆ వీడియోను బాగా వైరల్ చేస్తున్నారు.

రివ్యూ : కింగ్ ఈజ్ బ్యాక్​ - 'నా సామి రంగ' నాగ్ ర్యాంప్ ఆడిస్తున్నాడు!

హనుమాన్ స్క్రీన్స్​ ఇష్యూ- అగ్రిమెంట్ బ్రేక్- థియేటర్లకు TFPC అదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.