'దేశముదురు'తో వైశాలిగా తెలుగువారిని అలరించిన ముద్దుగుమ్మ హన్సిక తన ప్రియుడు సోహైల్‌తో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జైపుర్‌లోని ఓ రాజకోటలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. కుటుంబసభ్యుల సమక్షంలో జరగనున్న ఈ వేడుకలో పాల్గొనేందుకు కొంతమంది అతిథులకు ఆహ్వానాలు అందాయి. అయితే వాళ్లు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన సెలబ్రిటీలు మాత్రం కాదు.. నిరుపేద చిన్నారులు.

హన్సికకు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమంటే ఎంతో ఇష్టం. పలు ఎన్జీవోలతో కలిసి నిరుపేద చిన్నారులకు చేతనైనంత సాయం చేస్తోంది. ఈ క్రమంలోనే తన వివాహానికి ఆయా ఎన్జీవోలకు చెందిన పలువురు చిన్నారులకూ ఆహ్వానాలు పంపించింది. తమని ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు ఆహ్వానించిన హన్సికకు ధన్యవాదాలు చెబుతూ చిన్నారులు ఓ వీడియో క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు ఆమె మంచి మనసుని మెచ్చుకుంటున్నారు. అలాగే, వివాహ వేదిక పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న చిన్నారులకు ఆమె ఈ రోజు భోజనాన్ని పంపించనున్నారు.
ప్రీ వెడ్డింగ్‌లో డ్యాన్స్‌తో అదరగొట్టిన జోడీ

-
One of the most beautiful divas of her generation, Hansika Motwani is all set to tie the knot with the love of her life#ExtendedGuestList pic.twitter.com/2qsiuaZc2m
— ᴍᴀɴɪ 🏹 (@ManiPrabhass) December 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">One of the most beautiful divas of her generation, Hansika Motwani is all set to tie the knot with the love of her life#ExtendedGuestList pic.twitter.com/2qsiuaZc2m
— ᴍᴀɴɪ 🏹 (@ManiPrabhass) December 3, 2022One of the most beautiful divas of her generation, Hansika Motwani is all set to tie the knot with the love of her life#ExtendedGuestList pic.twitter.com/2qsiuaZc2m
— ᴍᴀɴɪ 🏹 (@ManiPrabhass) December 3, 2022
-
Our rockstar @ihansika with her sizzling moves 🤍💗 killin it ✨ #hansikamotwaniwedding #hansukishaadi #HS #HansuSohael pic.twitter.com/TvJypmkfYQ
— ⭐️Hansika_ismine⭐️ (@Hansika_ismine) December 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Our rockstar @ihansika with her sizzling moves 🤍💗 killin it ✨ #hansikamotwaniwedding #hansukishaadi #HS #HansuSohael pic.twitter.com/TvJypmkfYQ
— ⭐️Hansika_ismine⭐️ (@Hansika_ismine) December 3, 2022Our rockstar @ihansika with her sizzling moves 🤍💗 killin it ✨ #hansikamotwaniwedding #hansukishaadi #HS #HansuSohael pic.twitter.com/TvJypmkfYQ
— ⭐️Hansika_ismine⭐️ (@Hansika_ismine) December 3, 2022
ప్రీ వెడ్డింగ్ పార్టీలో భాగంగా శనివారం హన్సిక - సోహైల్ డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. బాలీవుడ్ పాటలకు డ్యాన్స్‌లు చేశారు. ఆయా వీడియోలు ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">