ETV Bharat / entertainment

Guntur Kaaram Mahesh Poster : మాస్​ లుక్​లో మహేశ్​ సర్​ప్రైజ్​.. గళ్ల లుంగీతో కొత్త పోస్టర్​.. - గుంటూరు కారం లేటెస్ట్ పోస్టర్

Guntur Kaaram Mahesh Poster : మహేశ్​ బాబు బర్త్​డే సందర్భంగా గుంటూరు కారం మూవీ మేకర్స్​ ఫ్యాన్స్​కు ఓ గ్రాండ్ సర్​ప్రైజ్​ ఇచ్చారు. సినిమాలోని మహేశ్​ మరో లుక్​కు సంబంధించిన పోస్టర్​ రిలీజ్​ చేశారు. ఆ ఫొటో మీరు కూడా చూసేయండి మరి..

Guntur Kaaram Mahesh Poster
Guntur Kaaram Mahesh Poster
author img

By

Published : Aug 9, 2023, 6:49 AM IST

Updated : Aug 9, 2023, 7:32 AM IST

Guntur Kaaram Mahesh Poster : టాలీవుడ్​ సూపర్​ స్టార్ మహేశ్​ బాబు ప్రస్తుతం 'గుంటూరు కారం' సినిమాలో నటిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన మహేశ్​ బాబు, శ్రీలీల పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ఇప్పుడు మరో అప్డేట్​ నెట్టింట తెగ ట్రెండ్​ అవుతోంది.

ఆగస్ట్​ 9న మహేశ్​ బర్త్​డే సందర్భంగా మూవీ యూనిట్​ ఓ మాస్​ సర్​ప్రైజ్​ ఇచ్చింది. బుధవారం​ అర్ధరాత్రి సరిగ్గా 12:06 నిమిషాలకు గుంటూరు కారం నుంచి మహేశ్​ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అందులో మహేశ్​ లుంగీ కట్టుకుని మాస్​ లుక్​లో కనిపించారు. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని.. ఓ చేత్తో స్టైలిష్​గా చుట్టా కాలుస్తూ కనిపించారు. ఇక ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్​ ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. రాత్రి నుంచే ఈ పోస్టర్​ను సోషల్ మీడియాలో ట్రెండ్​ చేస్తున్నారు.

ఆ రెండు విషయాలపై ఫుల్​ క్లారిటీ..
Guntur Kaaram Release Date : గత కొంత కాలంగా ఈ సినిమా చిత్రీకరణలో పలు మార్పులు జరిగాయి. దీంతో ఈ సినిమా రిలీజ్​ డేట్​ పై అభిమానుల్లో సందిగ్ధత నెలకొంది. అనుకున్నట్లే సంక్రాంతికి ఈ సినిమా వస్తుందా లేదా అంటూ ఫ్యాన్స్​ ఆందోళన పడ్డారు. అయితే ఈ అన్ని ప్రశ్నాలను సమాధానిమచ్చేలా ఈ మాస్​ పోస్టర్​ను తయారు చేసింది మూవీ టీమ్​.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న 'గుంటూరు కారం' విడుదలకు సిద్ధం కానున్నట్లు అఫీషియల్​గా చెప్పేసింది. అంతే కాకుండా మ్యూజిక్​ డైరెక్టర్​ తమన్​ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకొంటున్నారంటూ గతంలో వచ్చిన వార్తలను పరోక్షంగానే కొట్టిపారేసింది. పోస్టర్​లో ఆయన పేరును ప్రస్తావించి ఆ డౌట్​ను క్లారిఫై చేసింది. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఆయనే కొనసాగనున్నట్లు తెలిపింది.

అయితే ఇంత వరకూ బాగానే ఉన్నప్పటికీ, మహేశ్‌ పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్​ కేవలం ఓ పోస్టర్​ను మాత్రమే విడుదల చేయడం పట్ల అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. సినిమా నుంచి ఏదైనా లిరికల్‌ సాంగ్‌, లేకుంటే గ్లింప్స్‌ లాంటిది ఇచ్చి ఉంటే వారి సంబరాలు అంబరాన్ని అంటేవి. కనీసం డైలాగ్‌ టీజర్‌నైనా విడుదల చేస్తే బాగుండేదంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇక ఆగస్టు 15 నాటికి మరేదైనా అప్డేట్​ ఇస్తారేమో వేచి చూడాలి.

Guntur Kaaram Cast : ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్​ హాసిని నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేశ్‌ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇక సీనియర్​ నటులైన రమ్యకృష్ణ, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్​లు ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'ఉస్తాద్' యూటర్న్​.. మహేశ్​ 'గుంటూరు కారం'తో పోటీకి రెడీ!

Gunturu Karam Shooting : మహేశ్​ తిరిగొచ్చేస్తున్నాడహో.. ఆ రోజు నుంచే షూటింగ్ షురూ..

Last Updated : Aug 9, 2023, 7:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.