Guntur Kaaram Dil Raju : సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'. మహేశ్ - త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ చిత్రంగా సంక్రాంతి కానుకగా ఈ శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. రిలీజ్ రోజు భారీ రేంజ్లో అభిమానుల హంగామా కనిపించింది. కానీ తొలి షో నుంచే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఆడియెన్స్ నుంచి నెగిటివ్ రెస్పాన్స్, క్రిటిక్స్ నుంచి నెగిటివ్ రివ్యూలు నెట్టింట్లో బాగా వచ్చాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ ఈ చిత్రంలో ఎక్కడా కనిపించలేదని చాలా మంది అన్నారు. అభిమానులైతే గోల చేశారు. మహేశ్ బాబు క్యారెక్టరైజేషన్, శ్రీలీల డ్యాన్సులు తప్ప సినిమాలు పాజిటివ్ అంశాలు లేవని కామెంట్స్ వచ్చాయి. అయితే దీనిపై తాజాగా నిర్మాతలు నాగవంశీ, దిల్‌రాజు స్పందించారు.
దిల్ రాజు మాట్లాడుతూ - "రాత్రి 1 గంటకు ప్రదర్శించిన బెనిఫిట్ షోలు, ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ రివ్యూస్ వచ్చిన మాట వాస్తవమే. నేను కూడా సోషల్ మీడియాలో యావరేజ్, మిక్స్డ్ టాక్ చూశాను. మహేశ్ క్యారెక్టరైజేషన్ బేస్ చేసుకుని మదర్ అండ్ సన్ ఎమోషన్స్ మీద చేసిన సినిమా ఇది. ప్రతి షోకు టాక్ మారుతుంది. గతంలో ఇలానే చాలా సినిమాలు మిక్స్డ్ టాక్‌తో మొదలై బ్లాక్ బస్టర్స్ అందుకున్నాయి. త్రివిక్రమ్ డైలాగ్స్‌కు, మహేశ్ క్యారెక్టర్‌కు ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. గుంటూరు కారం ఏ రేంజ్‌కు వెళుతుంది అనేది పండగ తర్వాత వచ్చిన లెక్కల ఆధారంగా అర్థం అవుతుంది. ప్రతి సంక్రాంతికి సినిమాల విషయంలో పోటీ, గొడవలు సహజమే. ఎందుకంటే ఇది బిజినెస్. తర్వాత అందరూ మర్చిపోతారు" అని దిల్ రాజు అన్నారు. నిర్మాత నాగవంశీ కూడా ఇదే విషయాన్నీ చెప్పారు.
రికార్డ్ రేంజ్లో కలెక్షన్స్ : మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఈ చిత్రం తొలి రోజు రూ. 94 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మూవీటీమ్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. మరి రెండో రోజు కలెక్షన్స్ ఎంత వస్తాయనేది వేచి చూడాలి. మరోవైపు హను మన్ చిత్రం యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది.
-
#DilRaju pic.twitter.com/h95ktZ552I
— CineJosh (@cinejosh) January 13, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">#DilRaju pic.twitter.com/h95ktZ552I
— CineJosh (@cinejosh) January 13, 2024#DilRaju pic.twitter.com/h95ktZ552I
— CineJosh (@cinejosh) January 13, 2024
'గుంటూరు కారం' ఓపెనింగ్స్ - ఆల్ టైమ్ రికార్డ్ - ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?