ETV Bharat / entertainment

గోల్డెన్​ గ్లోబ్ వేడుకలో 'RRR'​ సందడి.. లైవ్​ ఎక్కడ చూడాలో తెలుసా? - గోల్డెన్​ గ్లోబ్​ అవార్డ్స్ ఆర్ఆర్​ఆర్​

Golden Globe Awards 2023 : ప్రతిష్ఠాత్మక గోల్డెన్​ గ్లోబ్​ అవార్డ్​కు రెండు క్యాటగిరీల్లో 'ఆర్ఆర్​ఆర్'​ నామినేట్​ కావడం వల్ల ఈ సారి ఆ​ వేడుక మరింత ప్రత్యేకంగా మారనుంది. అయితే ఈ అవార్డ్స్​ ఫంక్షన్​ను ఎప్పుడు, ఎక్కడ చూడాలో తెలుసా?

Golden Globes 2023 rrr
Golden Globes 2023 rrr
author img

By

Published : Jan 9, 2023, 2:11 PM IST

Updated : Jan 9, 2023, 2:22 PM IST

Golden Globe Awards 2023 RRR: దిగ్గజ దర్శకుడు రాజమౌళి అద్భుత సృష్టి 'ఆర్​ఆర్ఆర్'​. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో నటించిన నటులు రామ్​చరణ్​, ఎన్టీఆర్​కు ప్రపంచ దేశాల్లో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఎన్నో అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ఈ మాస్టర్​పీస్​.. ప్రఖ్యాత గోల్డెన్​ గ్లోబ్​ అవార్డ్స్​లో 'నాటు నాటు' సాంగ్​తో ఉత్తమ పాట, ఆంగ్లేతర భాషా చిత్రం కేటగిరీల్లో నామినేట్​ అయింది. దీంతో ఈసారి గోల్డెన్​ గ్లోబ్ అవార్డ్స్​ వేడుక మరింత ప్రత్యేకంగా మారనుంది. కాగా, అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగే ఈ అవార్డ్స్​ వేడుకకు 'ఆర్​ఆర్ఆర్'​ బృందం వెళ్లింది.

గోల్డెన్​ గ్లోబ్​ వేడుక ఎప్పుడు, ఎక్కడ చూడాలి?
ఈ వేడుకను హాలీవుడ్​ ప్రెస్​ అసోషియేషన్(హెచ్​ఎఫ్​పీఏ) నిర్వహిస్తుంది. ఈ ఫంక్షన్​కు హాలీవుడ్ నటుడు జెరోద్​ కార్​మైఖేల్​ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అనా డి అర్మాస్, జామీ లీ కస్టిస్, ట్రాకీ మోర్గాన్ ప్రెజెంటర్లుగా ఉన్నారు. ఈ గోల్డెన్​ గ్లోబ్​ 80వ అవార్డుల ఈవెంట్​ జనవరి 11న(అమెరికాలో 10న) జరగనుంది. సాయంత్రం 5:30 గంటలకు రెట్​ కార్పెట్​ సందడి మొదలవుతుంది. 6:30 గంటల నుంచి అవార్డుల వేడుక ప్రారంభమవుతుంది. అమెరికాలో జనవరి 10న ఎన్​బీసీ(NBC ), పికాక్​(Peacock )లో లైవ్​ టెలీకాస్ట్​ అవుతుంది. ఇండియాలో లయన్స్​గేట్​ ప్లే(Lionsgate Play)లో ప్రసారం అవుతుంది.​

Golden Globes 2023 rrr
గోల్డెన్​ గ్లోబ్ వేడుకలో 'RRR'​ సందడి.. లైవ్​ ఎక్కడ చూడాలో తెలుసా?

2022లో ఈ వేడుక లైవ్​ ప్రసారాలు జరగలేదు. అవార్డుల నామినీల్లో అవకతవకలు జరిగాయంటూ హెచ్​ఎఫ్​పీఏ నిరసన తెలిపింది. మీడియా సంస్థలు, నటులు, టెక్నీషియన్లు కూడా ఈ వేడుకను బహిష్కరించారు. దీంతో ఈ అవార్డు ఫంక్షన్​ ప్రైవేటుగానే జరిగింది. విన్నర్లను ప్రెస్​ రిలీజ్​ చేసి ప్రకటించారు.

Last Updated : Jan 9, 2023, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.