ETV Bharat / entertainment

Unstoppable 2: బాలయ్యతో మాజీ సీఎం ముచ్చట్లు.. ఓల్డ్ ఫ్రెండ్స్ కలిస్తే ఆ కిక్కే వేరు! - శర్వానంద్‌తో బాలయ్య చేసిన కామెడీ

నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్​గా వ్యవహరిస్తున్న 'అన్‌స్టాపబుల్ 2 విత్ ఎన్‌బీకే'లో బాలయ్య పాత మిత్రుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి కిరణ్​ కుమార్​ రెడ్డి సందడి చేయనున్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆహా ఓటీటీ వెల్లడించింది. మరి పాత మిత్రులు మళ్లీ కలుసుకుని ప్రేక్షకులు చూస్తుండగా ముచ్చట్లు పెడితే ఆ కిక్కే వేరు కదూ!

unstoppable with kiran kumar reddy
బాలయ్యతో మాజీ ముఖ్యమంత్రి కిరణ్​ కుమార్​ రెడ్డి
author img

By

Published : Nov 16, 2022, 10:24 AM IST

నటసింహా నందమూరి బాలకృష్ణ హోస్ట్ వ్యవహరిస్తున్న 'అన్‌స్టాపబుల్ 2 విత్ ఎన్‌బీకే'లో ఈవారం రాబోయే గెస్ట్​ ఎవరో 'ఆహా' ప్రకటించింది. అన్‌స్టాపబుల్ 2 ఎపిసోడ్ 4లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ కేతిరెడ్డి సురేష్ రెడ్డి అతిథులుగా విచ్చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ ఎపిసోడ్.. ఈనెల 18 నుంచి ప్రేక్షకుల ముందు అలరించనుంది. ఈ విషయాన్ని ఆహా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

''ఫ్రెండ్స్ కలిసినప్పుడు మాటలకు అంతే ఉండదు! ఈ ముగ్గురి ముచ్చట్లు, తీపి జ్ఞాపకాలు ఎపిసోడ్ 4లో..'' అని ఆహా ట్వీట్‌లో పేర్కొంది. దానికి సంబంధించిన ఫొటోలను షేర్​ చేసింది.

బాలకృష్ణ, కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో కలిసి చదువుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి క్లాస్‌మేట్స్ కాగా.. బాలకృష్ణ వీరికి ఒక ఏడాది సీనియర్. కానీ, వీరంతా ఒక బ్యాచ్‌లా ఉండేవారు. కలిసి క్రికెట్ ఆడేవారు. ముఖ్యంగా బాలకృష్ణతో కిరణ్ కుమార్ రెడ్డి చాలా క్లోజ్‌గా ఉండేవారు. ఈ విషయాన్ని ఆయనే చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇప్పుడు ఈ ముగ్గురు మిత్రులు కలవబోతున్నారు. తొలిసారి ఒక వేదికపై ముచ్చటించబోతున్నారు. మరి పాత మిత్రులు మళ్లీ కలుసుకుని ప్రేక్షకులు చూస్తుండగా ముచ్చట్లు పెడితే ఆ కిక్కే వేరు కదూ!

బాలకృష్ణ హోస్ట్‌గా 'అన్‌స్టాపబుల్' సూపర్ సక్సెస్ కావడంతో.. ఆహా సీజన్ 2ను మొదలుపెట్టింది. ఈ సీజన్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో మొదలుపెట్టి అందరి దృష్టిని మరోసారి 'అన్‌స్టాపబుల్' వైపు ఆకర్షించింది. మొదటి ఎపిసోడే సూపర్ డూపర్ హిట్ అయ్యింది. బావ చంద్రబాబు, అల్లుడు నారా లోకేశ్‌తో బాలయ్య ముచ్చట్లు బాగా పాపులర్​ అయ్యాయి. ఇక రెండో ఎపిసోడ్‌లో యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డను బాలయ్య తీసుకొచ్చారు. వాళ్లతో చాలా సరదాగా ముచ్చట్లు పెట్టారు. మూడో ఎపిసోడ్‌లో శర్వానంద్, అడివి శేష్ అతిథులుగా వచ్చారు. వీరితోనూ బాలయ్య భళా అనిపించారు. ముఖ్యంగా శర్వానంద్‌తో బాలయ్య చేసిన కామెడీ అందరినీ ఆకర్షించింది.

ఇప్పుడు నాలుగో ఎపిసోడ్‌లో తన స్నేహితులతో బాలయ్య ముచ్చట్లు పెట్టబోతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఊహించని విధంగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన కిరణ్ కుమార్ రెడ్డి.. రాష్ట్రం విడిపోయిన తరవాత రాజకీయాలకు దూరమైపోయారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి ఆ తరవాత కాలంలో ప్రత్యక్ష రాజకీయాల్లో దూరంగా ఉన్నారు. మరి దీని మీద 'అన్‌స్టాపబుల్'లో ఎలాంటి చర్చ జరుగుతుందో.. బాలయ్య ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారన్నది ఆసక్తి కలిగిస్తోంది.

ఇదీ చదవండి: ఆ నాలుగు కోరికలు తీరకుండానే అనంతలోకాలకు సూపర్​ స్టార్​!

సూపర్​ స్టార్​ కృష్ణ గురించి ఈ ఆసక్తికర విషయాలు ఎప్పుడైనా విన్నారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.