ETV Bharat / entertainment

రజనీ కూతురి ఇంట్లో చోరీ 'ఆమె' పనే.. నగలను అమ్మి 'బంగ్లా' కొనుగోలు చేసి! - ఐశ్వర్య రజనీకాంత్​ నగలు

సూపర్​స్టార్​ రజనీకాంత్​ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్​ ఇంట్లో బంగారాన్ని ఆమె పనిమనిషే దొంగలించింది. డ్రైవర్​ సహాయంతో వాటిని చోరీ చేసింది. అంతే కాకుండా నగలను అమ్మి.. ఇల్లు కూడా కొనుగోలు చేసింది.

aishwarya rajinikanth
aishwarya rajinikanth
author img

By

Published : Mar 22, 2023, 8:52 AM IST

తమిళనాడు.. చెన్నైలో.. సూపర్​స్టార్​ రజనీకాంత్​ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్​ ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసుల ఛేదించారు. బంగారు, వజ్రాభరణాలు దొంగిలించినందుకు గాను ఆమె ఇంట్లో పనిమనిషి, కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐశ్వర్య కారు డ్రైవర్ వెంకటేశన్​ సహకారంతో పనిమనిషి ఈశ్వరి సుమారు 100 తులాల బంగారు ఆభరణాలు, 30 గ్రాముల వజ్రాభరణాలు, నాలుగు కిలోల వెండి ఆభరణాలను అపహరించింది. 18 ఏళ్లుగా పనిమనిషిగా పనిచేసిన ఈశ్వరికి ఐశ్వర్య రజనీకాంత్ ఇంటిపై పూర్తి అవగాహన ఉంది. దీంతో 2019 నుంచి పలుమార్లు లాకర్ తెరిచి నగలను దొంగిలించింది.

ముఖ్యంగా ఈశ్వరికి ముగ్గురు ఆడపిల్లలు ఉండడంతో ఆమె ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఐశ్వర్య నగలు దొంగలించిన ఈశ్వరి.. వాటిని అమ్మి ఇల్లు కొనుగోలు చేసింది. దొంగిలించిన బంగారంలో కొంత భాగం.. వెంకటేశన్​కు కూడా ఇచ్చింది. అయితే ఈశ్వరి, వెంకటేశన్​లను పోలీసులు విచారించగా.. వారిద్దరూ నిజాన్ని ఒప్పుకున్నారు. దీంతో ఈశ్వరి నుంచి ఇంటి కొనుగోలుకు సంబంధించిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈశ్వరి, వెంకటేశ్​న్‌లను అరెస్టు చేసిన పోలీసులు.. ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.

ఇదీ జరిగింది.. ఐశ్వర్య రజనీకాంత్.. తన ఇంట్లో భారీ దొంగతనం జరిగినట్లు గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. 2019లో తన సోదరి సౌందర్య పెళ్లి కోసం చివరిగా నగలను ధరించినట్లు ఐశ్వర్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చోరీకి గురైన నగల్లో డైమండ్ సెట్లు, పాత బంగారు ఆభరణాలు, నవరత్న సెట్లు, నెక్లెస్‌లు, బ్యాంగిల్స్ ఉన్నాట్లు తెలిపారు. సోదరి పెళ్లిలో ఆభరణాలు ధరించిన తర్వాత దానిని లాకర్‌లో ఉంచినట్లు చెప్పారు. 2019 నుంచి మూడు ఇళ్లు మారామని, కానీ ఎక్కడా తెరవలేదని చెప్పారు. కానీ ఫిబ్రవరి 10న చూసేసరికి ఆభరణాలు కనిపించలేదని పేర్కొన్నారు.

అయితే లాకర్​లో నగలు ఉన్నట్లు తన ఇంట్లో పనిచేసే ఉద్యోగులకు తెలుసని ఐశ్వర్య పోలీసులకు చెప్పారు. వారిపైనే అనుమానం ఉన్నట్లు తెలిపారు. దీంతో ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తమదైన శైలిలో విచారించారు. సీసీటీవీ ఫుటేజ్​ ఆధారంగా.. ఐశ్వర్య ఇంట్లో వజ్రాభరణాలు దొంగిలించినందుకు ఈశ్వరి, వెంకటేశన్​లను అరెస్ట్​చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.