ETV Bharat / entertainment

వెంకీ​.. మళ్లీ ఆ మిస్టేక్​ రిపీట్​ చేయొద్దు ప్లీజ్! - సినిమాల ఎంపికల విషయంలో గాడి తప్పుతున్న వెంకీ

హీరో వెంకటేశ్​ను ఆయన అభిమానులు మళ్లీ అలాంటి పొరపాటు చేయొద్దని కోరుతున్నారు! ఇంతకీ అదేంటంటే? ఆ వివరాలు..

Venkatesh
వెంకీ​.. మళ్లీ ఆ మిస్టేక్​ రిపీట్​ చేయొద్దు ప్లీజ్!
author img

By

Published : Apr 26, 2023, 5:22 PM IST

స్టార్ హీరోల సినిమాలు, పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఫుల్ లెన్త్​ అయినా లేదా కెమియో అయినా. ఏ మాత్రం కాస్త ఏమరుపాటుగా ఉన్నా.. ఆ ప్రభావం వారిపై పడుతుంది. వారి ఇమేజ్​ను డ్యామేజ్​ చేస్తుంది. అందుకే ఒక్కోసారి ఎక్స్​పెరిమెంట్​ చేసి బోల్తా పడినా.. ఆ తర్వాత అలాంటి సాహసాలు చేయరు హీరోలు. అయితే ఇప్పుడీ విషయం ఎందుకంటే.. విక్టరీ వెంకటేశ్​ ప్రస్తుతం అలాంటి పొరపాటే చేస్తున్నారనిపిస్తోంది.

తెలుగు ప్రేక్షకుల్లో ఆయనకు క్రేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యామిలీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎన్నో హిట్​ చిత్రాల్లో నటించి'విక్టరీ'ని తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. కొన్నిసార్లు ట్రాక్ తప్పినా.. మళ్లీ మంచి కంటెంట్​ ఉన్న చిత్రాలతో కమ్​బ్యాక్​ ఇచ్చి సక్సెస్​లను అందుకున్నారు. ప్రస్తుతం కాలానికి అనుగుణంగా కెరీర్​లో ముందుకెళ్తున్నారు వెంకటేశ్​. నవతరం స్టార్లతో జోడీ కడుతూ.. ఆడియెన్స్​ను అలరిస్తున్నారు. మరోవైపు తన వయసుకు తగ్గ పాత్రలతోనూ సందడి చేస్తున్నారు. అయితే ఇప్పుడు కొంతకాలంగా సినిమాల విషయంలో ఆయన ఎక్స్​పెరిమెంట్లు కాస్త గాడి తప్పినట్టు కనిపిస్తోంది. 'నారప్ప'తో సూపర్​ హిట్​ అందుకున్నప్పటికీ.. ఆ తర్వాత గత మూడు చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. రీసెంట్​గా వచ్చిన సల్మాన్​ ఖాన్​ 'కిసీ కా భాయ్​ కిసీ కీ జాన్'​లో హీరోయిన్​ పూజా హెగ్డేకు అన్నయ్య పాత్ర చేశారు. ఇది ఆయనకు ఎలాంటి పేరును తీసుకురాలేకపోయింది. నిజానికి ఈ సినిమా అనౌన్స్​మెంట్​ అప్పటి నుంచే విమర్శలను ఎదుర్కొంది. అంతకుముందు 'రానా నాయుడు' వెబ్​సిరీస్​లో బోల్డ్​ కంటెంట్​తో కనిపించి అలరించడానికి ప్రయత్నించారు. కానీ అది వెంకీపై నెగటివిటీని తీసుకొచ్చింది. ఫ్యామిలీ హీరోగా ఇమేజ్​ ఉన్న ఆయన బోల్డ్ కంటెంట్​ను ఎంచుకోవడం వల్ల ఫ్యామిలీ ఆడియెన్స్​కు నచ్చలేదు. దాని కన్నా ముందు విశ్వక్​ సేన్​​ 'ఓరి దేవుడా' చిత్రంలో దేవదూత పాత్రను పోషించారు. ఆ క్యారెక్టర్​ కూడా ఆడియెన్స్​కు కనెక్ట్​ అవ్వలేదు. సినిమా స్కేల్​ను పెంచలేదు. అలా ఆయన నటించిన మూడు సినిమాలు ఫ్యాన్స్​ను మెప్పించలేకపోయాయి. దీంతో సినీ ప్రియులు.. వెంకీ 75వ సినిమా యాక్షన్​ ఎంటర్​టైనర్​ 'సైంధవ్'​పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి ఈ సినిమా ఏం చేస్తుందో..

ఏదేమైనప్పటికీ.. వెంకీ ప్రయోగాలవైపు మొగ్గు చూపడం మంచిదే అయినా.. సెట్​ అవ్వని కంటెంట్​లో నటించొద్దని ఫ్యాన్స్​ కోరుతున్నారు. ఇకపోతే త్వరలోనే 'రానా నాయుడు 2' సీజన్​ కూడా రాబోతుంది. కనీసం ఇందులో అయినా.. బోల్డ్ కంటెంట్ సీన్స్ అండ్ డైలాగ్స్​ తగ్గిస్తే బాగుంటుందని అభిమానులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: 'ఏజెంట్' ప్రీ రిలీజ్​ బిజినెస్.. అయ్యగారి టార్గెట్ ఫిక్స్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.