ETV Bharat / entertainment

బాద్​ షా బర్త్​ డే ట్రీట్​ - కామెడీ అండ్​ ఎమోషనల్​ డ్రామాగా 'డంకీ' టీజర్​​ - రాజ్​ కుమార్ హిరాణీ షారుక్ ఖాన్ సినిమా

Dunki Teaser : బాలీవుడ్ బాద్‌షా షారుక్​ ఖాన్ - ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీతో కలిసి చేస్తున్న సినిమా 'డంకీ'. అయితే నేడు నవంబర్ 2 షారుక్​ ఖాన్​ పుట్టినరోజు కావడంతో.. అభిమానుల కోసం డంకీ మేకర్స్ మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఓ చిన్న టీజర్​ను రిలీజ్ చేసి ఫ్యాన్స్​ను ఖుషి చేశారు.

Dunki Teaser : బాద్​ షా బర్త్​ డే ట్రీట్​ - కామెడీ అండ్​ ఎమోషనల్​ డ్రామాగా 'డంకీ' టీజర్​​

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2023, 12:53 PM IST

Updated : Nov 2, 2023, 1:21 PM IST

Dunki Teaser : పఠాన్​, జవాన్ వంటి చిత్రాలతో రూ.2000 కోట్ల భారీ బ్లాక్ బస్టర్​ హిట్లను అందుకున్న బాలీవుడ్ బాద్‌షా షారుక్​ ఖాన్ ఇప్పుడు హ్యాట్రిక్ హిట్​ మీద కన్నేశారు. ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీతో కలిసి 'డంకీ' సినిమా చేస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రం.. ఇప్పుడు రిలీజ్​కు రెడీ అయింది. మొదటి భాగం క్రిస్మస్​కు బాక్సాఫీస్​ వద్ద సందడి చేయనుంది. అయితే నేడు నవంబర్ 2 షారుక్​ ఖాన్​ పుట్టినరోజు కావడంతో.. ఓ చిన్న టీజర్​ను రిలీజ్ చేసి అభిమానులకు సర్​ప్రైజ్ ఇచ్చారు మేకర్స్​.

టీజర్ ప్రారంభంలో.. షారుక్ ఖాన్​తో పాటు కొంతమంది ఎడారిలో నల్ల డ్రెస్ ధరించుకుని ఇల్లీగల్​గా దేశం దాటుతూ కనిపించారు. అది చూసిన ఒకడు.. వారిపై అనుమానం వచ్చి తన గన్​తో​ వారిలో ఒకరిని కాల్చడం, అనంతరం ఆ సీన్​ను డైవర్ట్​ చేసి ఫ్లాష్​ బ్యాక్​లో తీసుకెళ్లారు. ఫన్​ అండ్ ఎమోషనల్​గా​ పాత్రలను పరిచయం చేస్తూ ప్రచార చిత్రాన్ని ముందుకు తీసుకెళ్లారు.

ఈ ప్రచార చిత్రంలో ఐదుగురు యంగస్టర్స్​ ఉన్నతమైన జీవితం కోసం ఇంగ్లాండ్‌ వెళ్లాలనే తమ కలను నెరవేర్చుకునేందుకు చేసిన ప్రయత్నమే ఈ కథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పంజాబ్‌ ప్రాంతంలోని యువకుల కథను ఇతివృత్తంగా తీసుకుని సినిమాను రూపొందించారు. మరి ఇంగ్లాండ్‌ వెళ్లేందుకు వారు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? ఇల్లీగల్​గా వెళ్లేందుకు సిద్ధమైన వారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వంటి వాటికి దేశభక్తిని జోడించి చూపించారు.

ఇక ఈ సినిమాలో తాప్సీ, విక్కీ కౌశల్, అనిల్ గ్రోవర్, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు. మున్నాభాయ్ ఎం.బీ.బీ.ఎస్, లాగేరహో మున్నాభాయ్, త్రీ ఇడియట్స్, పీకే, సంజు వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలను తీసిన రాజ్‌కుమార్ హిరానీ.. ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్​ అందుకుంటారని అంతా ఆశిస్తున్నారు. సినిమా ముందుగా అనుకున్నట్టే క్మిస్మస్​కు(Dunki Release Date) వచ్చి ప్రభాస్ సలార్​తో పోటీ పడనుంది. చూడాలి మరి ఏది విన్నర్​గా నిలుస్తుందో..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Nov 2, 2023, 1:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.