ETV Bharat / entertainment

షూటింగ్​లో గాయపడ్డ స్టార్ డైరెక్టర్​.. కార్​ ఛేజింగ్ సీన్స్​ తెరకెక్కిస్తూ.. - గాయపడ్డ దర్శకుడు రోహిత్​ శెట్టి

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్​​ రోహిత్ శెట్టి షూటింగ్​లో గాయపడ్డారు. ఓ వెబ్​సిరీస్​ షూటింగ్ కోసం హైదరాబాద్​ వచ్చిన ఆయన.. కారు ఛేజింగ్​ సీక్వెన్స్​ తెరకెక్కిస్తుండగా ప్రమాదానికి గురయ్యారు.

Rohithshetty met with an accident in Ramoji film movie shooting
షూటింగ్​లో గాయపడ్డ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి​.. కార్​ చేజింగ్ సీన్స్​ తెరకెక్కిస్తూ..
author img

By

Published : Jan 7, 2023, 3:58 PM IST

Updated : Jan 7, 2023, 5:08 PM IST

బాలీవుడ్ అగ్ర దర్శకుడు రోహిత్ శెట్టి ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్​లో ఓ వెబ్​సిరీస్​ షూటింగ్​ కోసం వచ్చిన రోహిత్.. చిత్రీకరణ సమయంలో గాయపడినట్లు తెలుస్తోంది. కారు ఛేజింగ్​ సన్నివేశాల్ని తెరకెక్కించేటప్పుడు ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం అందింది. ఆయన చేతికి బాగా గాయాలు అయినట్లు తెలిసింది. వెంటనే ఆయన్ను కామినేని హాస్పిటల్​కు తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మైనర్​ సర్జరీ చేశారని సినీ వర్గాలు తెలిపాయి.

కాగా, యాక్షన్‌ చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన దర్శకుడు రోహిత్‌ శెట్టి.. ప్రస్తుతం పోలీస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ 'ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌' రూపొందిస్తున్నారు. సిద్ధార్థ్‌ మల్హోత్ర ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. కబీర్‌ మాలిక్‌ అనే శక్తిమంతమైన పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో సిద్ధార్థ్‌ కనిపించనున్నాడు. ఈ వెబ్​సిరీస్​ షూటింగ్​లోనే రోహిత్ గాయపడ్డారు.

ఇకపోతే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, రోహిత్‌ శెట్టి పిక్చర్స్‌ కలసి ఈ వెబ్​సిరీస్​ను నిర్మిస్తున్నాయి. మన దేశంలో నిస్వార్థంగా పనిచేస్తున్న పోలీసుల ధైర్య సాహసాలను ఆధారం చేసుకుని ఈ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నామని నిర్మాణ సంస్థలు ప్రకటించాయి. 8 ఎపిసోడ్లుగా రానున్న ఈ సిరీస్‌ నేరుగా అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇదీ చూడండి: చెంఘీజ్‌ఖాన్​ బయోపిక్​లో బాలయ్య.. ఇంతకీ ఆయన ఎవరబ్బా?

Last Updated : Jan 7, 2023, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.