దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఏకంగా ఆస్కార్ అవార్డు రావడం వల్ల ఓ రెేంజ్లో గుర్తింపు సంపాదించుకున్నారు. హాలీవుడ్ దిగ్గజాలు సైతం జక్కన్నను కొనియాడారు. ఇప్పుడు అందరి దృష్టి.. ఆయన నెక్స్ట్ సినిమాపైనే ఉంది. ఇప్పటికే మన జక్కన్న సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తదుపరి సినిమా ఉంటుందని అనౌన్స్ చేసేశారు. చేయటమే కాదు.. దానికి సంబంధించిన కథను రెడీ చేస్తున్నారు. దీనికి సంబంధించి తండ్రి, పాన్ ఇండియా రైటర్ అయిన విజయేంద్ర ప్రసాద్‌తో చర్చలు జరుపుతున్నారు.
ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ ఓ ఎత్తు.. ఆస్కార్ అవార్డు వరించిన తర్వాత చేస్తున్న SSMB 29 మరో ఎత్తు. అందుకోసం రాజమౌళి భారీ స్కెచ్‌లు వేస్తున్నారు. ఏకంగా ఈసారి హాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్‌తో పాటు టెక్నీషియన్స్‌తోనూ చేతులు కలుపుతున్నారు. ఇప్పటికే హాలీవుడ్ సంస్థ క్రియేటివ్ ఆర్టిస్ట్ ఏజెన్సీ (CAA)తో అగ్రిమెంట్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సంస్థ ప్రముఖ హాలీవుడ్ నటీనటులను ఈ సినిమాలో నటించడానికి ఒప్పిస్తుంది. దాంతో పాటు ఈ సినిమాలో థోర్ మూవీ యాక్టర్ క్రిస్ హెమ్స్ వర్త్ నటిస్తారనే టాక్ ఉంది.
కాగా.. ఇప్పుడు ఏకంగా ఈ సినిమాలో హీరోయిన్‌గా హాలీవుడ్ భామను రంగంలోకి దించుతున్నారట జక్కన్న. ఇది తెలిసిన ఫ్యాన్స్.. జక్కన్న స్కెచ్ మామూలుగా లేదురోయ్ అని అనుకుంటున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో పూజా కార్యక్రమాలను చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో SSMB 29ను తెరకెక్కించేలా రాజమౌళి ప్లాన్ చేసుకున్నారట.
జేమ్స్ బాండ్, ఇండియానా జోన్స్ తరహా యాక్షన్ మూవీని మహేశ్‌తో చేయడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. గ్లోబెల్ రేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా SSMB 29ను తెరకెక్కించబోతున్నట్లు ఇప్పటికే దర్శక ధీరుడు కొన్ని ఇంటర్వ్యూల్లో తెలియజేశారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ మూవీ కాబట్టి మినిమం బడ్జెట్టే రూ.500 కోట్లు అని టాక్. మరి మేకింగ్‌లో ఇదెంత మేరకు పెరుగుతుందో చూడాలి మరి.
ఇక, సినిమాల విషయానికొస్తే.. మహేశ్ బాబు సర్కారు వారి పాట మూవీ తర్వాత మాటల మాంత్రికుడు తివ్రిక్రమ్తో చేతులు కలిపారు. SSMB 28 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. అయితే మహేశ్- తివ్రిక్రమ్ కాంబినేషన్లో ఇదివరకే అతడు, ఖలేజా సినిమాలు తెరకెక్కాయి.