ETV Bharat / entertainment

ఆ సినిమా ఫ్లాప్‌.. సీక్వెల్‌ ఎలా చేస్తా: కృష్ణవంశీ - కృష్ణవంశీ డేంజర్ సినిమా

ఓ సినిమాకు సీక్వెల్​ తీసే విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు దర్శకుడు కృష్ణవంశీ. రెండో భాగంగా తీయనని క్లారిటీ ఇచ్చేశారు. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే..

Krishnavamsi reacts on Danger movie sequel
డేంజర్ సినిమా సీక్వెల్​పై కృష్ణవంశీ
author img

By

Published : Oct 31, 2022, 8:47 PM IST

క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌తో గతంలో తెరకెక్కిన చిత్రం 'డేంజర్‌'. అయితే ఈ చిత్రం పరాజయాన్ని అందుకుంది. దీనికి కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. నరేశ్‌, స్వాతి, సాయిరామ్‌ శంకర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం విడుదలై సుమారు 17 ఏళ్లు అవుతోన్న నేపథ్యంలో ఈ సినిమా సీక్వెల్‌పై కృష్ణ వంశీ స్పందించారు.

'డేంజర్‌'కు స్వీకెల్‌ తెరకెక్కించవచ్చు కదా..! అంటూ ఓ నెటిజన్ ట్వీట్‌ చేయగా.. ''ఈ సినిమా ఫ్లాప్‌ సర్‌. నా ఉద్దేశం ప్రకారం ప్రేక్షకులు దాన్ని అంగీకరించలేదు. అలాంటప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపు ఎలా చేయగలను'' అని కృష్ణవంశీ సమాధానమిచ్చారు. మరో నెటిజన్‌.. 'మీ ఉద్దేశంలో ఫ్లాప్‌ అంటే ఏమిటో నాకు తెలియదు. కానీ, ఆ సినిమా మా మనుసు దోచుకుంది' అని ట్వీట్‌ చేశాడు. ''సినిమాపై పెట్టిన డబ్బును కూడా నిర్మాత తిరిగి పొందలేకపోతే దాన్నే ఫ్లాప్‌ అంటారు. డబ్బే రాజ్యం ఏలుతున్న ఈరోజుల్లో ఇలాంటి సినిమాపై పెట్టుబడి పెట్టడానికి ఏ నిర్మాత కూడా ముందుకురాడు'' అని ఆయన బదులిచ్చారు. ప్రస్తుతం కృష్ణవంశీ 'రంగమార్తాండ' తెరకెక్కిస్తున్నారు. బ్రహ్మానందం, ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ ..తదితరులు నటిస్తున్నారు.

ఇదీ చూడండి: ఆ నటిపై బాలయ్య ప్రశంసలు.. భావితరాలకు ఆమె ఆదర్శమంటూ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.