ETV Bharat / entertainment

'వాల్తేరు వీరయ్య' ప్రీ రిలీజ్‌ ఈవెంట్​కు లైన్‌ క్లియర్‌ - ​ వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్​ వార్తలు

మెగాస్టార్ చిరింజీవి నటించిన తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య' ప్రీ రిలీజ్ ఈవెంట్​పై నెలకొన్న సందిగ్ధత వీడింది. ఆ వివరాలు..

Valteru veerayya pre release event
'వాల్తేరు వీరయ్య' ప్రీరిలీజ్‌ ఈవెంట్​కు లైన్‌ క్లియర్‌
author img

By

Published : Jan 7, 2023, 7:58 PM IST

మెగాస్టార్ చిరింజీవి నటించిన తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. అయితే ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్​పై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు దానిపై క్లారిటీ వచ్చింది. ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలోనే వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించుకునేందుకు అనుమతించినట్లు విశాఖ సీపీ శ్రీకాంత్ తెలిపారు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఈనెల 8న విశాఖ ఆర్కేబీచ్‌ రోడ్డులో నిర్వహించేందుకు చిత్ర బృందం అనుమతి కోరింది. ఆదివారం సాయంత్రం బీచ్‌ రోడ్డుకు సందర్శకులు భారీగా వస్తారని.. ట్రాఫిక్‌, భద్రతా సమస్యలు వస్తాయన్నారు. ప్రత్నామ్నాయ స్థలం చూసుకోవాలని సీపీ సూచించారు. దీంతో సినిమా యూనిట్‌ ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజీ గ్రౌండ్‌ను పరిశీలించి దరఖాస్తు చేసుకోగా.. అనుమతిచ్చినట్లు సీపీ శ్రీకాంత్‌ తెలిపారు.

కాగా, చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'వాల్తేరు వీరయ్య'. శ్రుతిహాసన్‌ కథానాయిక. రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి:చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' టైటిల్​ వెనక ఇంత పెద్ద కథ ఉందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.