ETV Bharat / entertainment

Acharya First review: మెగాఫ్యాన్స్​కు పూనకాలే.. ఫుల్​ మాస్​ మసాలా!

Acharya First review: మెగాస్టార్​ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాను వీక్షించిన సెన్సార్​ బోర్డు సభ్యుడు, సినీ విశ్లేషకుడు ఉమైర్​ సంధు ఫస్ట్​ రివ్యూను సోషల్​మీడియాలో పోస్ట్​ చేశారు. మాస్​ ప్రేక్షకులకు ఫుల్​ మసాలా అందించే సినిమాని ట్వీట్​ చేశారు.

Acharya First review
ఆచార్య ఫస్ట్​ రివ్యూ
author img

By

Published : Apr 27, 2022, 9:23 AM IST

Acharya First review: మెగాస్టార్​ చిరంజీవి, రామ్​చరణ్​ కలిసి నటించిన సినిమా 'ఆచార్య'. ఏప్రిల్​ 29న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆచార్యను వీక్షించిన సెన్సార్​ బోర్డు సభ్యుడు, సినీ విశ్లేషకుడు ఉమైర్​ సంధు ఫస్ట్​ రివ్యూను సోషల్​మీడియాలో పోస్ట్​ చేశారు. మాస్​ ప్రేక్షకులను సినిమా విపరీతంగా ఆకట్టుకుంటుందని చెప్పారు.

"మాస్​ ప్రేక్షకులకు ఫుల్​ మసాలా అందించే సినిమా. చిరు, చరణ్​ తన నటనతో మెస్మరైజ్​ చేశారు. పండగ సీజన్​లో సరికొత్త రికార్డును సృష్టిస్తుంది." అని ట్వీట్​ చేశారు. ఈ ట్వీట్​తో సినిమా అంచనాలు మరింత పెరిగాయి. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డులను క్రియేట్​ చేస్తుందో చూడాలి.

Acharya First review
ఆచార్య ఫస్ట్​ రివ్యూ

కాగా, 'ఆచార్య' విషయానికొస్తే.. దేవాలయాల ప్రాముఖ్యత, వాటిని అడ్డుపెట్టుకుని కొంతమంది చేసే అవినీతిని చూపించే కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకుడు. చిరు, చరణ్​, పూజాహెగ్డే, సోనూసూద్​ ప్రధాన పాత్రల్లో నటించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడెక్షన్స్‌ బ్యానర్స్‌పై నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ స్వరాలు సమకూర్చారు.

ఇదీ చూడండి: చిరు తొలిసారి 'నక్సలైట్​'గా చేసిన సినిమా ఏంటో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.