ETV Bharat / entertainment

జవాన్లకు రామ్​చరణ్ స్పెషల్ ట్రీట్.. షారుక్​ కొత్త చిత్రం - షారుక్​ ఖాన్​

మెగా పవర్​ స్టార్​ రామ్​చరణ్​ RC 15 షూటింగ్​ పంజాబ్​లో జరుగుతోంది. షూటింగ్ విరామంలో చెర్రీ.. ఖాసా ప్రాంతంలో బీఎస్​ఎఫ్​ సైనికులతో గడిపారు. ఆ ఫోటోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. మరోవైపు, బాలీవుడ్​ స్టార్​ హీరో షారుక్​ ఖాన్​తో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు బీటౌన్​ దర్శకుడు రాజ్​కుమార్​ హిరానీ ప్రకటించారు.

BSF RAM CHARAN TREAT SRK NEW MOVIE
BSF RAM CHARAN TREAT SRK NEW MOVIE
author img

By

Published : Apr 19, 2022, 6:13 PM IST

Updated : Apr 19, 2022, 7:22 PM IST

Ramcharan With BSF Soldiers: మెగా పవర్​ స్టార్​ రామ్​చరణ్​- దర్శకుడు శంకర్​ కాంబోలో తెరకెక్కుతున్న RC 15 ప్రాజెక్టు.. ప్రస్తుతం పంజాబ్​లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో చెర్రీ.. అమృత్​సర్​లోని ఖాసా ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న బీఎస్​ఎఫ్​ క్యాంపుకు వెళ్లి సైనికులతో భోజనం చేసి కాసేపు గడిపారు. చెర్రీ.. తన చెఫ్​ను హైదరాబాద్​ నుంచి రప్పించి సైనికుల కోసం ప్రత్యేక వంటకాలు వండించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. అంతకుమందు రామ్​చరణ్​ సతీమణి ఉపాసన.. అమృత్​సర్​లోని గోల్డెన్​ టెంపుల్​కు వెళ్లి ప్రత్యేక పూజలు జరిపారు.

బీఎస్​ఎఫ్​ సైనికులతో రామ్​చరణ్​
బీఎస్​ఎఫ్​ సైనికులతో రామ్​చరణ్​
బీఎస్​ఎఫ్​ సైనికులతో రామ్​చరణ్​
బీఎస్​ఎఫ్​ సైనికులతో రామ్​చరణ్​

Sharukh Khan New Movie With Rajkumar Hirani: హీరో షారుక్‌ ఖాన్‌ స్పీడ్‌ పెంచారు. ఇప్పటికే సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న 'పఠాన్' చిత్రం షూటింగ్‌ తుదిదశకు చేరుకుంది. అదేవిధంగా అట్లీ దర్శకత్వంలో షారుక్‌ చేస్తున్న సినిమా కూడా ప్యాచ్‌వర్క్‌ మినహా పూర్తయింది. ఈ రెండు సినిమాల పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. అయితే తాజాగా బాలీవుడ్​ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరానీ.. షారుక్‌ఖాన్‌ హీరోగా 'డంకి' పేరుతో సినిమా తెరకిక్కస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్‌ ఒక షెడ్యూల్​ కూడా పూర్తయిందని తెలిపారు మేకర్స్​. తరువాత షెడ్యూల్​ పంజాబ్​లో, ఆ తర్వాత విదేశీ లొకేషన్స్‌లో చిత్రీకరణ ఉంటుందని చెప్పారు. అక్రమంగా పాస్‌పోర్టులు పొంది విదేశాల్లో చదువుకోవాలనుకునే వారి నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందని బీ టౌన్‌ టాక్‌. ఈ చిత్రంలో తాప్సీ హీరోయిన్‌. 2023 డిసెంబరు 23న క్రిస్మస్​ కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. వీరిద్దరి కాంబోలో ఇదే మొదటి చిత్రం. మున్నాభాయ్‌ ఎంబీబీఎస్, 3 ఇడియట్స్, పీకే వంటి బ్లాక్​బస్టర్ చిత్రాలను తెరకెక్కించారు హిరానీ.

Samantha Kaathuvaakula Rendu Kaadal New Song: స్టార్​ హీరోయిన్​ సమంత.. హీరో విజయ్‌ సేతుపతి, నయనతారతో కలిసి నటించిన చిత్రం 'కాత్తు వాక్కుల రెండు కాదల్‌'. దీనికి నయనతార ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌ దర్శకుడు. అనిరుధ్‌ సంగీతం అందించిన ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవల పూర్తయ్యింది. అయితే ఈ చిత్రం నుంచి కొత్త అప్డేట్​ వచ్చింది. బుధవారం సాయంత్రం 6 గంటలకు 'డిప్పం డప్పం' సాంగ్​ను విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కాగా, ఏప్రిల్​ 28వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

కాత్తు వాక్కుల రెండు కాదల్‌
సమంత కాత్తు వాక్కుల రెండు కాదల్‌

ఇవీ చదవండి: హీరో సిద్ధార్థ్ కొత్త మూవీ.. చిరు '154' లేటెస్ట్​ అప్డేట్​

గోల్డెన్ టెంపుల్​లో ఉపాసన.. లంగర్ ఏర్పాటు చేసిన చెర్రీ

Last Updated : Apr 19, 2022, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.