ETV Bharat / entertainment

బ్రో' టీజర్​లో​ పూజా హెగ్డే.. అంతా త్రివిక్రమ్​ దయ! - బ్రో టీజర్​లో​ పూజా హెగ్డే

Bro movie teaser : పవర్ స్టార్​ పవన్‌ కల్యాణ్‌ 'బ్రో' టీజర్​లో పూజా హెగ్డే కనిపించింది. దీంతో సోషల్​మీడియాలో అంతా ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు.

Pawankalyan  Saitej Bro movie teaser released
'బ్రో' టీజర్​లో​ పూజా హెగ్డే.. అంతా త్రివిక్రమ్​ దయ!
author img

By

Published : Jun 29, 2023, 10:47 PM IST

Bro movie teaser : పవర్​స్టార్ పవన్ కల్యాణ్​ 'బ్రో' సినిమా.. టీజర్ తాజాగా రిలీజై అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో పవన్ వింటేజ్ లుక్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పవన్- ఆయన మేనల్లుడు తేజ్ కామెడీ టైమింగ్​తో పాటు తమన్​ మ్యూజిక్​ హైలైట్​గా ఉంది. ఫ్యాన్స్​లో ఫుల్​ జోష్​నిచ్చింది. దీంతో ఈ టీజర్​ను సోషల్​మీడియాలో ఫుల్​ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. అలాగే మరోవైపు ఈ టీజర్​లో మరొక విషయంపై కూడా నెట్టింట్లో ట్రోల్ కూడా చేస్తున్నారు. అదేంటంటే.. 'బ్రో' టీజర్​లో పూజా హెగ్డే గురించి.

trivikram srinivas pooja hegde : అదేంటి పూజాహెగ్డే ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారా? ఫ్లోలో ముందు సరిగ్గా చూసి ఉండరు. టీజర్​ ప్లే చేయగానే మొదట షాపింగ్​ మాల్​ యాడ్​ పోస్టర్​ వస్తోంది. దాని తర్వాతే టీజర్ ప్రారంభమవుతోంది. ఆ యాడ్​లోనే పూజా హెగ్డే ఉంది. ఇప్పుడా పోస్టర్​నే అభిమానులు, నెటిజన్లు ఫుల్ ట్రోల్ చేస్తున్నారు.

ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందించారు. ఆయనే.. పూజా హెగ్డేను యాడ్ చేయడానికి.. టీజర్​ను లేట్​గా రిలీజ్​ చేశారంటూ సరదాగా తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఈ టీజర్​లో పెట్టడానికేనా .. మహేశ్​ 'గుంటూరు కారం' నుంచి తీసేశావా అంటూ త్రివిక్రమ్​పై సరదా సెట్టైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం సోషల్​మీడియా అంతా ఇదే సరదా చర్చ. పూజా లేకుండా త్రివిక్రమ్ సినిమాలు అస్సలు చేయలేరు. ఎక్కడ ఓ చోట ఆమె ఉండాల్సిందే అంటూ అంటున్నారు. అసలే త్రివిక్రమ్​కు పూజా లక్కీ హీరోయిన్. ఆమె ఉంటే ఆయనకు సినిమా హిట్ గ్యారెంటీ. కాబట్టి ఇక 'బ్రో' కూడా హిట్టే అంటూ చెప్పుకొస్తున్నారు.

Pawan kalyan sai dharam tej movie : ఇక 'బ్రో' సినిమా విషయానికొస్తే.. తమిళంలో సూపర్​ హిట్​గా నిలిచిన వినోదయ సీతమ్​కు రీమేక్​గా ఇది రూపొందోంది. తమిళంలో సముద్రఖని స్వీయ దర్శకత్వంలో రూపొందిందీ చిత్రం. ఆయనే తెలుగులో దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జులై 28న తేదీన ఈ సినిమా భారీ స్థాయిలో​ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి :

జూలై నుంచి అక్టోబర్​ వరకు ముందుందిగా సినిమా పండగ!

'OG సీన్స్​ చూశాక దిమ్మ తిరిగిపోయింది'.. పవన్ ఫ్యాన్స్​కు కిక్ ఇచ్చే న్యూస్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.