Bro movie prelease event : పవన్ కల్యాణ్ - సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా 28న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. మెగా హీరోలు వరుణ్‌తేజ్, వైష్ణవ్ తేజ్ చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. అలాగే అభిమానులు కూడా భారీ సంఖ్యలోలోనే పాల్గొని సందడి సందడి చేశారు.
మాటిస్తున్నాను తప్పకుండా అలా చేస్తా... "బ్రో ఈవెంట్‌కు వచ్చిన మా ఫ్యామిలీకి(అభిమాలను ఉద్దేశిస్తూ) నా హృదయ పూర్వక నమస్కారాలు. ఇంతటి ప్రేమ, అభిమానాన్ని సినిమానే నాకిచ్చింది. నా ప్రతి చిత్రంలో ఈ సమాజానికి ఉపయోగపడే అంశాలు ఉండాలని చూసుకుంటాను. ఈ చిత్రంలోనూ సమాజానికి ఉపయోగ పడే అంశం పుష్కలంగా ఉంటుంది. కరోనా సమయంలో ఈ చిత్రం గురించి త్రివిక్రమ్ చెప్పారు. రచయిత, దర్శకుడిని 100 శాతం నమ్ముతాను. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే మీ అందరినీ దృష్టిలో పెట్టుకుని చాలా అద్భుతంగా రాశారు. సముద్రఖనిగారిది తమిళనాడు. అయినప్పటికీ తెలుగు భాషపై గట్టి పట్టు సాధించారు. షూటింగ్ మొదటి రోజు.. ఆయన తెలుగులో స్క్రిప్ట్ చదువుతున్నారు. ఇప్పుడు ఈ వేదికపై మీకు మాటిస్తున్నాను. ఆయన తెలుగు నేర్చుకున్నారు. నేను కూడా తమిళం నేర్చుకుంటాను" అని పవన్ చెప్పుకొచ్చారు.
తారక్ చరణ్‌లా అలా చేయలేను .. "ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లా డ్యాన్స్ చేయలేను. ప్రభాస్, రానాల బలమైన పాత్రలను పోషించలేను. కానీ, సినిమా అంటే నాకు అమితమైన ప్రేమ. ఈ సమాజం అంటే బాధ్యత. సినీ పరిశ్రమ ఏ ఒక్క కుటుంబానికీ చెందినది కాదు. ప్రతిఒక్కరిదీ. అలాగే రాజకీయం కూడా. మేమంతా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాం. స్టార్ స్టేటస్ అందుకున్నాక.. 'నువ్వు హీరో అవుతావా?' అని అన్నయ్య చిరంజీవి అడిగినప్పుడు.. చాలా భయమేసింది. ఎందుకంటే అప్పటివరకు హీరో అంటే చిరంజీవినే. ఎప్పుడూ నన్ను నేను ఓ హీరోలాగా అస్సలు ఊహించుకోలేదు. ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ, పొలంలో పనిచేసుకోవాలని అనుకునేవాడిని. కానీ మా వదినే నాలో మార్పు తీసుకొచ్చింది. ఎప్పడైనా మనల్ని నమ్మేవారు ఒకరుండాలి." అని పవన్ పేర్కొన్నారు.
మా వదిన ద్రోహం చేసింది.. "ఓసారి వైజాగ్ జగదాంబ సెంటర్‌లో బస్‌పై షూటింగ్ జరిగింది. అప్పుడు నాకు చాలా సిగ్గేసింది. నలుగురిలో యాక్ట్ చేయలేక ఏడ్చేశాను. మా వదినకు ఫోన్ చేసి.. ' సినిమాల్లోకి ఎందుకు పంపించావ్' అని అడిగాను. ఆ రోజు మా వదిన చేసిన తప్పే.. ఈరోజు నన్ను ఇలా ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఆమె చేసిన ఈ ద్రోహం గురించి మాటల్లో చెప్పలేను(నవ్వుతూ). అన్నయ్య చిరంజీవిని మించి కష్టపడాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. సహజంగానే శారీరకంగా కష్టపడేవాడిని. మొరటు మనిషిని కూడా. నాకు తెలిసిందల్లా కష్టపడి పనిచేయడం మాత్రమే. అదే ఈ రోజు కోట్లాది మంది అభిమానుల్ని తెచ్చి పెట్టింది. ఒకే ఫ్యామిలీ నుంచి ఇంత మంది హీరోలు వచ్చారంటే చాలామందికి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. కానీ.. మేమంతా కూడా గొడ్డు చాకిరి చేస్తాము. ఆడియెన్స్‌ను, అభిమానులను అలరించేందుకు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాం. ఓ దిగువ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చిన మేమే ఇంత చేస్తున్నప్పుడూ... మీరందరు ఎందుకు చేయలేరు" అని పవన్ చెప్పుకొచ్చారు. 'అసలు నేను కోరుకున్న లైఫ్ ఇది కాదు. దేవుడే నన్నిలా నడిపిస్తున్నాడు. యాక్టర్ అవ్వాలని, పొలిటీషియన్ అవ్వాలని నేనెప్పుడూ అనుకోలేదు' అని పవన్ వేదికపై మాట్లాడారు.
ఇదీ చూడండి :