ETV Bharat / entertainment

భర్త లేని టైమ్​లో కాజోల్​కు ఫ్రెంచ్​ కిస్​ పెట్టిన పాక్​ నటుడు.. థ్యాంక్స్​ చెప్పిన బ్యూటీ! - కాజోల్​ అలీఖాన్​ సీన్​

బాలీవుడ్ బ్యూటీ కాజోల్‌కు పాక్‌ నటుడు అలీ ఖాన్‌ ఫ్రెంచ్ కిస్ పెట్టారట. అది కూడా కాజోల్​ భర్త అజయ్​ దేవగణ్​ లేని సమయంలోనేనట. ఆ తర్వాత కాజోల్​ థ్యాంక్స్​ చెప్పి నవ్వేశారట.

british-pakistani-actor-alyy-khan-recalls-shooting-kissing-scene-with-longtime-crush-kajol

author img

By

Published : Jan 18, 2023, 7:48 PM IST

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్‌కు బ్రిటిష్‌-పాక్‌ నటుడు అలీ ఖాన్‌ ఫ్రెంచ్ కిస్ పెట్టారట. కాజోల్ అంటే తనకు చాలా ఏళ్ల నుంచి క్రష్ ఉందని చెప్పుకొచ్చిన అలీ ఖాన్‌.. ప్రస్తుతం ఆమెతో కలిసి 'ది గుడ్‌ వైఫ్‌' వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్‌ ఇంగ్లీష్‌లో వచ్చేయగా.. తాజాగా హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ సిరీస్‌లో కాజోల్, అలీ ఖాన్ లవర్స్‌గా నటిస్తున్నారు. 'ది ఫ్యామిలీ మ్యాన్‌' వెబ్ సిరీస్ ఫేమ్ సుపర్న్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్‌లో భాగంగా కాజోల్, అలీ ఖాన్‌ మధ్య ఓ లిప్‌ లాక్ సీన్ ఉందట. దాంతో తొలుత అలీ ఖాన్ భయపడినా.. కాజోల్ భర్త అజయ్ దేవగణ్ లేని సమయంలో ఆ సీన్‌ను చిత్రీకరించినట్లు ఈ బ్రిటిష్‌-పాక్‌ నటుడు చెప్పుకొచ్చారు.

"ముంబయిలోని ఓ హోటల్​లో ఆ సీన్​ను షూట్​ చేశాం. అంతకు ముందు నేను చాలా టెన్షన్​ పడ్డాను. కాసేపు చూయింగ్​ గమ్​ కూడా నమిలాను. రెండు మూడు సార్లు ప్రాక్టీస్​ కూడా చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు ప్రొఫెషనల్​ యాక్టర్స్​లా ఆ సీన్​ను పూర్తి చేశాం. ఆమెనా క్రష్. ఆ విషయాన్ని ఆమెకు ముందే చెప్పడం వల్ల మరింత టెన్షన్​ భయపడ్డాను. కానీ సీన్ తొందరగా పూర్తి చేయడం వల్ల కాజోల్​ 'థ్యాంక్యూ డార్లింగ్​' అని చెప్పి నవ్వేశారు."

-- అలీ ఖాన్​, బ్రిటిష్​-పాక్​ నటుడు

కాజోల్​ భర్త అజయ్​ దేవగణ్​.. వరుసగా సినిమాల్లో నటిస్తూనే దర్శకత్వం కూడా చేస్తున్నారు. తమిళ హీరో కార్తీ నటించిన ఖైదీ సినిమాను 'భోళా' పేరుతో హిందీలో అజయ్​ దేవగణ్​ రీమేక్​ చేస్తున్నారు. అందులో సీనియర్​ నటి టబు పోలీస్​ ఆఫీసర్​గా కనిపించబోతున్నారు. అలాగే కాజోల్​ కూడా త్వరలో 'త్రిభంగ' సినిమాతో ప్రేక్షకుల మందుకు రానున్నారు. అయితే 2017లో ధనుష్​ హీరోగా వచ్చిన వీఐపీ 2 మూవీలో కాజోల్​ నటించారు. ఆ మూవీ బాక్సాఫీస్​ వద్ద నిరాశపరించింది. దీంతో ఈ సీనియర్​ హీరోయిన్​ మళ్లీ సౌత్​ వైపు దృష్టి సారించలేదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.