ETV Bharat / entertainment

ఆర్టిస్ట్​ అనీశ్​గా అదరగొట్టేసిన నాగ్​.. వెయ్యి నందుల బలంతో.. - నాగార్జున

బాలీవుడ్​ స్టార్​ రణ్​బీర్​ కపూర్​ కథానాయకుడిగా నటిస్తున్న పాన్​ ఇండియా చిత్రం 'బ్రహ్మాస్త్రం'. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్డేట్​ వచ్చింది. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న కింగ్​ నాగార్జునకు సంబంధించి ఫస్ట్​ లుక్​ను విడుదల చేసింది మూవీటీమ్​. పవర్​ఫుల్​ లుక్​లో ఉన్న నాగ్​ను చూసి ఫ్యాన్స్​ సంబరపడుతున్నారు.

d
d
author img

By

Published : Jun 11, 2022, 4:18 PM IST

Updated : Dec 23, 2022, 4:34 PM IST

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కింగ్​ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్​ చిత్రం 'బ్రహ్మాస్త్ర'. తెలుగులో 'బ్రహ్మాస్త్రం' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్​ పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్​లుక్​ను రిలీజ్​ చేసింది చిత్రబృందం. 'వెయ్యి నందుల బలం.. నందీ అస్త్రం' అని పేర్కొంది. ఆర్టిస్ట్​ అనీశ్​గా నాగ్​ చేసిన పాత్ర ఈ చిత్రంలో చాలా ప్రత్యేకమని దర్శకుడు అయాన్​ ముఖర్జీ అన్నారు. పవర్​ఫుల్​ లుక్​లో నాగ్​ను చూసి అభిమానులు ఖుషీ అయిపోయారు. నాగ్​ పాత్రను పరిచయం చేస్తూనే ఈ ట్రైలర్​ గురించి కూడా క్లారిటీ ఇచ్చేసింది మూవీ టీమ్​. ఈనెల 15న ట్రైలర్​ను రిలీజ్​ చేస్తామని చెప్పింది.

కరణ్​జోహార్​ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రణ్​బీర్​ కపూర్​ - ఆలియాభట్​లు హీరోహీరోయిన్లు కాగా.. అమితాబ్​ బచ్చన్​, మౌనీ రాయ్, నాగార్జునలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబరు 9న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది.

7 Days 6 Nights: 'ఒక్కడు', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా!', 'వర్షం', 'పౌర్ణమి' వంటి చిత్రాలను నిర్మించి టాలీవుడ్‌లో మంచి విజయాలు అందుకున్న నిర్మాత ఎం.ఎస్‌.రాజు. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన కొత్త చిత్రం '7 డేస్‌ 6 నైట్స్‌'. ఆయన కుమారుడు సుమంత్‌ అశ్విన్‌ హీరోగా ఈ సినిమా సిద్ధమైంది. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా జూన్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. "అన్నా.. నా లాస్ట్‌ వీక్‌ ఆఫ్‌ ఫ్రీడమ్ ఇది..‌" అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌లో చివరి వరకూ ఎలాంటి సంభాషణలు లేకుండా ఆకట్టుకునేలా సాగింది. మెహర్‌ చాహల్‌, రోహన్‌, కృతికా శెట్టి ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. వైల్డ్‌ హనీ ప్రొడెక్షన్‌ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది.

ఇదీ చూడండి : పెళ్లిపై మాట్లాడిన సాయిపల్లవి.. ఏమన్నారంటే?

Last Updated : Dec 23, 2022, 4:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.