ETV Bharat / entertainment

యంగ్​ అండ్​ హిట్​​ డైరెక్టర్స్​తో బ్రహ్మాజీ బీర్ పార్టీ.. చిల్​ కొడుతున్నారుగా! - బ్రహ్మాజీ బీర్​ పార్టీ హను రాఘపూడి

టాలీవుడ్​ నటుడు బ్రహ్మాజీ తాజాగా చేసిన ఓ ట్వీట్​ వైరల్​ అవుతోంది. ఇందులో ఆయన డైరెక్టర్స్​ హను రాఘవపూడి(సీతారామం), శివ నిర్వాణ సహా పలు దర్శకులతో కలిసి బీర్​ పార్టీ చేసుకుంటూ కనిపించారు.

bramhaji
యంగ్​ డైరెక్టర్స్​తో బ్రహ్మాజీ బీర్ పార్టీ.. చిల్​ కొడుతున్నారుగా!
author img

By

Published : Jan 28, 2023, 5:00 PM IST

తెలుగులో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో సహాయ నటుడు, నెగటివ్‌ రోల్స్‌ చేసి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు నటుడు బ్రహ్మాజీ. తన తరం వారు అడపా దడపా సినిమాలు చేస్తుంటే ఆయన మాత్రం వరుస సినిమాలు చేస్తూ కెరీర్​లో రాణిస్తున్నారు. అయితే ఒక్కప్పుడు ఎక్కువగా విలన్​ పాత్రలే చేసిన ఆయన ఇప్పుడు హాస్య పాత్రలకే ఎక్కువగా పరిమితమయ్యారు. ఇంకా సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. అయితే నెటిజన్లను నవ్వించేందుకు ఆయన వేసే ట్వీట్లు ఒక్కోసారి కాంట్రవర్సీకి కూడా దారి తీస్తుంటాయి. దీంతో ఆయన ట్రోల్స్​​ బారిన కూడా పడుతుంటారు. అలా విమర్శలను కూడా ఎదుర్కొంటుంటారు.

ఇటీవలే రీసెంట్​గా మెగా ఫ్యామిలీపై కాంట్రవర్సీ కామెంట్స్​ చేసిన నటి రోజాపై సెటైర్లు వేసి సోషల్​మీడియాలో హాట్​టాపిక్​గా మారారు. అయితే అయితే తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆయన చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్​గా మారింది. చేతిలో బీర్ గ్లాస్​ పట్టుకుని.. యంగ్ డైరెక్టర్స్​తో తన ఇంట్లో పార్టీ చేసుకున్నారు. 'డైరెక్టర్స్ అడ్డా' అంటూ క్యాప్షన్​ జోడించారు. వీరిలో హను రాఘవపూడి, శివ నిర్వాణ సహా పలు దర్శకులు కనిపించారు. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ కూడా చేశారు. కారెక్టర్లు ఇవ్వమని కాకాపడుతున్నావా? అంటూ సరదా కామెంట్స్​ చేస్తున్నారు. ఇకపోతే బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావ్ 'ఓ పిట్ట కథ' సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే.

bramhaji
యంగ్​ డైరెక్టర్స్​తో బ్రహ్మాజీ బీర్ పార్టీ

ఇదీ చూడండి: 300మందితో రామ్​ పోతినేని ఫైట్.. ఈ సారి చరణ్​ లేకుండానే RC 15

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.