ETV Bharat / entertainment

మాధురీ దీక్షిత్​ తల్లి కన్నుమూత.. సంతాపం తెలిపిన ప్రముఖులు - మాధురి దీక్షిత్​ తల్లి స్నేహ లత దీక్షిత్​

బాలీవుడ్​ నటి మాధురీ దీక్షిత్​ ఇంట విషాదం నెలకొంది. ఆమె తల్లి స్నేహలత దీక్షిత్​ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖలు సంతాపం తెలుపుతున్నారు.

madhuri dixit mother
madhuri dixit mother
author img

By

Published : Mar 12, 2023, 11:19 AM IST

Updated : Mar 12, 2023, 2:46 PM IST

ప్రముఖ బాలీవుడ్​ నటి మాధురీ దీక్షిత్‌​ ఇంట విషాదం నెలకొంది. ఆమె తల్లి స్నేహలత దీక్షిత్​ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషాదకర వార్తను మాధురీ దీక్షిత్​ దంపతులు తెలిపారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మాధురి కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నారు. ఆమె అంత్యక్రియలను ముంబయిలోని వోర్లీలో నిర్వహించనున్నట్లు మాధురి కుటుంబ సభ్యులు తెలిపారు. 'ఆమె ప్రశాంతంగా తనకు ఇష్టమైన వారి మధ్య, వారిని చూస్తూనే స్వర్గానికి పయనమయ్యారు' అంటూ మాధురి భావోద్వేగానికి లోనయ్యారు.

గత ఏడాది తన తల్లి బర్త్​డే సందర్భంగా ఆమెకు విషెస్​ చెబుతూ సామాజిక మాధ్యమాల్లో ఓ ఎమోషనల్​ పోస్ట్​ షేర్​ చేశారు మాధురి దీక్షిత్. 'హ్యాపీ బర్త్ డే అమ్మా.. కూతురికి అమ్మే మంచి ఫ్రెండ్ అని అంటుంటారు.. అది నిజమే కదా? మీరు నా కోసం చేసినవన్నీ, నాకు నేర్పిన విషయాలన్నీ కూడా నాకు బహుమతులే' అంటూ రాసుకొచ్చారు.

కాగా, 2013లో రిలీజైన మాధురీ దీక్షిత్​ 'గులాబ్ గ్యాంగ్' సినిమా కోసం తన కుమార్తె మాధురీ దీక్షిత్​తో కలిసి పనిచేశారు స్నేహలత దీక్షిత్​. ఈ విషయాన్ని దర్శకుడు అనుభవ్ సిన్హా ఒకానొక సందర్భంలో తెలిపారు. "మేము ఈ చిత్రంలో ఒక పాట పాడేందుకు మాధురిని సంప్రదించినప్పుడు, ఆమె సంతోషంగా అంగీకరించింది. ఆమె రికార్డింగ్ కోసం వచ్చినప్పుడు, ఆమె తన తల్లితో వచ్చింది. అప్పుడే ఆమె తల్లి చాలా మంచి గాయని అని మేము కనుగొన్నాము. అప్పుడు ఆమెను ఈ సినిమాలో ఓ పాట పాడేందుకు ఒప్పించాము అలా మాధురితో పాటు ఆమె తల్లి చేత సినిమాలో ఒక పాట పాడించామం" అని తెలిపారు.

ఓ డ్యాన్సర్​గా టాప్​ హీరోయిన్​గా బాలీవుడ్​లో తనకుంటూ ఓ స్టార్​డంను సంపాదించుకన్నారు మాధురీ దీక్షిత్​. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో 1998లో డా. శ్రీరామ్ నేనేని వివాహం చేసుకుని.. యూఎస్‌లో స్థిరపడ్డారు. ఆ తర్వాత సినిమాలకు కొంత కాలం బ్రేక్​ ఇచ్చాక ఇటీవలే ఇండియాకు వచ్చి తన సెకెండ్​ ఇన్నింగ్స్​ను ప్రారంభించారు.

తన సెకెండ్ ఇన్నింగ్స్​లోనూ మునుపటిలానే అదరగొడుతున్నారు మాధురీ దీక్షిత్​. అటు టీవీ షో లకు జడ్జీగా ఉంటూనే ఇటు పలు యాడ్స్​లో కనిపిస్తున్నారు. ఇక సినిమాల్లోనూ కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. తాజాగా సంజయ్​ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న హీరా మండి సినిమా కోసం సైన్​ చేశారు. సినిమాల్లోనే కాకుండా తన అభిమానుల కోసం సోషల్​ మీడియాలోనూ సందడి చేస్తుంటారు మాధురి.

Last Updated : Mar 12, 2023, 2:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.