Bhagvant Kesari Day 2 Collections : 'అఖండ', 'వీర సింహా రెడ్డి'తో వరుసగా రెండు భారీ బ్లాక్బాస్టర్ల సక్సెస్‌ను అందుకున్న నందమూరి నటసింహం బాలకృష్ణ.. తాజాగా 'భగవంత్ కేసరి'తో హ్యాట్రిక్ హిట్‌ను నమోదు చేశారు. ఈ చిత్రానికి తొలి రోజే ఫస్ట్ షో నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజు తీవ్ర పోటీ ఉన్నప్పటికీ కూడా మంచి ఓపెనింగ్స్‌ను దక్కించుకుంది. రెండో రోజు పోటీ మరింతగా పెరిగినా.. డీసెంట్ రెస్పాన్స్‌ను అందుకుంటోంది.
రెండో రోజు అయితే దళపతి విజయ్ 'లియో', రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' నుంచి పోటీ ఎదురైనా.. మంచిగానే కలెక్షన్స్‌ను నమోదు చేసినట్లు మూవీటీమ్ పేర్కొంది. బాక్సాఫీస్ వద్ద రెండు రోజుల్లో రూ. 50 కోట్లకు పైగా సంపాదించినట్లు పోస్ట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 51.12 కోట్ల గ్రాస్ వసూళు చేసినట్లు తెలిపింది.రెండో రోజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల వివరాల విషయానికి వస్తే.. నైజాంలో రూ. 3.52 కోట్లు, సీడెడ్‌లో రూ. 2. కోట్లు, ఏపీలో రూ.4.09 మొత్తంగా 9.91కోట్ల షేర్ వచ్చింది. ఏపీలో వచ్చేసరికి.. వెజాగ్లో రూ.98 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 68 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 53 లక్షలు, గుంటూరులో రూ. 72 లక్షలు, కృష్ణాలో రూ. 64 లక్షలు, నెల్లూరులో రూ.54 లక్షలు వచ్చాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక అమెరికాలో 700kపైగా డాలర్లు అంటే.. 5.8 కోట్ల వరకు వసూలు చేసిందట.
బాలకృష్ణతో పాటు ఈ చిత్రంలో శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించింది. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించారు. తమన్ మ్యూజిక్ అందంచారు. షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ఈ చిత్రం రివ్యూ(Bhagavanth Kesari Movie Review) విషయానికొస్తే.. బాలకృష్ణ - శ్రీలీల నటన, కథాంశం.. సంభాషణలు, భావోద్వేగాలు, పతాక సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు మైనస్ అయ్యాయి. ఫైనల్‌గా సినీ ప్రేక్షకులు.. భగవంత్ కేసరి చాలా కాలం యాదుంటాడు అని అభిప్రాయపడుతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Leo Box Office Collection Day 1 : బాక్సాఫీస్ ముందు 'లియో' రికార్డులు.. ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే?