ETV Bharat / entertainment

చేతిలో గ్లాస్​.. పక్కన హనీ రోజ్​.. పోజు అదిరిందయ్య బాలయ్య! - వీరసింహారెడ్డి సక్సెస్ సెలబ్రేషన్స్​

బాలకృష్ణ నటించిన తాజా ఫ్యాక్షన్ ఎంటర్​టైనర్​ సినిమా వీర సింహారెడ్డి. ఈ చిత్రంలో బాలయ్య మార్క్ యాక్షన్, ఫైట్ సీన్స్.. ఫ్యాన్స్​ను తెగ ఊపేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్​లో మూవీ టీమ్​ విజయోత్సవ వేడుకను నిర్వహించింది. అయితే ఈ ఈవెంట్​లో బాలయ్య.. హీరోయిన్ హనీ రోజ్​తో కలిసి ఇచ్చిన ఓ ఫొటో పోజు సోషల్​మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఫ్యాన్స్​కు కిక్​ ఎక్కిస్తోంది. ఆ సంగతులు..

Balakrishna Honey rose
చేతిలో గ్లాస్​.. పక్కన హనీ రోజ్​.. పోజు అదిరిందయ్య బాలయ్య!
author img

By

Published : Jan 23, 2023, 10:09 AM IST

Updated : Jan 23, 2023, 11:57 AM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ వీర సింహారెడ్డి సెక్సెస్​ను ఫుల్ ఎంజాయ్​ చేస్తున్నారు. అఖండతో బ్లాక్ బస్టర్ హిట్​ను అందుకున్న ఆయన.. తాజాగా వీరసింహారెడ్డితోనూ అంతకు మించిన హిట్​ను అందుకున్నారు. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్​ వద్ద మంచి వసూళ్లను అందుకుంటోంది. ఈ క్రమంలోనే మూవీటీమ్​.. సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది. వీరమాస్‌ బ్లాక్‌బస్టర్‌ పేరుతో వేడుకను నిర్వహించింది. అయితే బాలయ్య ఎక్కడుంటే అక్కడ ఎనర్జీ లెవల్స్ వేరే లెవల్లో ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్​లోనూ ఆయన తన మార్క్ ఉత్సాహంతో సందడి చేశారు.

ఇక ఈ వేడుకలో టీమ్​తో పాటు యంగ్ హీరోస్​ విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డతో పాటు దర్శకులు హరీష్‌శంకర్‌, అనిల్‌ రావిపూడి, హను రాఘవపూడి, శివ నిర్వాణ కూడా హాజరై ఎంజాయ్ చేశారు. మొత్తంగా ఈ ఈవెంట్ అంతా సందడి సందడిగా సాగింది. దీని తర్వాత వీరంతా కలిసి ఓ స్పెషల్​ పార్టీ కూడా చేసుకున్నారు. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను హీరో విశ్వక్ సేన్ తన ఇన్​స్టాలో కూడా పోస్ట్ చేశారు. అయితే ఓ ఫొటోలో బాలయ్య, వీరసింహారెడ్డి హీరోయిన్ హనీ రోజ్​తో కలిసి కిరాక్ పోజులో కనిపించారు. ఇద్దరి చేతుల్లో డ్రింక్ గ్లాసులు కనిపించాయి. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇంకా చెప్పాలంటే ఆ ఈవెంట్​కే స్పెషల్​ అట్రాక్షన్​గా నిలిచింది. దీంతో ఫ్యాన్స్ అయితే.. 'చేతిలో గ్లాసు.. పక్కన హనీ రోజు' అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక వీర సింహారెడ్డి విషయానికొస్తే.. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహించిన చిత్రమిది. బాలకృష్ణకి జోడీగా శ్రుతిహాసన్‌, హనీరోజ్‌ నటించారు. దునియా విజయ్​, వరలక్ష్మీ శరత్​కుమార్​ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

Balakrishna Honey rose
బాలకృష్ణ హనీరోజ్​

ఇదీ చూడండి: 'వీర‌సింహారెడ్డి' స‌క్సెస్ మీట్‌లో సింగర్​గా మారిన బాలయ్య.. ఏ పాట పాడారో తెలుసా?

Last Updated : Jan 23, 2023, 11:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.