ETV Bharat / entertainment

నాలోని నటుడ్ని గుర్తించింది ఆయనే: బాలకృష్ణ - బాలకృష్ణకు

Balakrishna Award: రవీంద్రభారతిలో సినారె 91వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలో నందమూరి నటసింహం బాలకృష్ణ సినారె జీవన సాఫల్య స్వర్ణకంకణం పురస్కారాన్ని అందుకున్నారు.

balakrishna
బాలకృష్ణ
author img

By

Published : Jul 30, 2022, 10:41 PM IST

Balakrishna Award: నందమూరి నటసింహం బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు సినారె జీవన సాఫల్య స్వర్ణకంకణం పురస్కారాన్ని అందజేశారు. రవీంద్రభారతిలో సినారె 91వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు ఈ అవార్డును బాలయ్యకు అందజేశారు. కాగా, తనకు అవార్డు దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు బాలయ్య. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. "సినిమా అనేది ఒక్కరిదే కాదు.. అందరి కష్టార్జితం. సినారె జీవితసాఫల్య స్వర్ణకంకణం స్వీకరించడం గర్వంగా ఉంది. సాహిత్యాన్ని బతికించిన వారిలో సినారె ప్రథముడు. నేను నటుడిని అవుతానని ఆయనే నాన్నకు(సీనియర్ ఎన్టీఆర్​) చెప్పారు. మా నాన్న మంచి స్నేహితుల్లో సినారె ఒకరు. ఆయన ఆశీస్సులతో మంచిమంచి పాత్రల్లో నటిస్తాను" అని అన్నారు.

బాలయ్య ప్రస్తుతం గోపిచంద్​ మలినేని దర్శకత్వంలో 'ఎన్​బీకే 107'లో నటిస్తున్నారు. ప్రస్తుతం కర్నూల్ సహా అక్కడి పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటోంది. శ్రుతిహాసనే హీరోయిన్​. కన్నడ స్టార్​ దునియా విజయ్​కుమార్​ ప్రతినాయకుడిగా కనిపిస్తుండగా, వరలక్ష్మీ శరత్​కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీమూవీ మేకర్స్​ నిర్మిస్తోంది. తమన్​ సంగీతం అందిస్తున్నారు. ఆ తర్వాత బాలయ్య చేయబోయే 108వ సినిమా ఇప్పటికే ఖరారైంది. దీనికి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించనున్నారు. హైఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో.. బాలయ్య ఐదు పదుల వయసున్న తండ్రిగా కనిపించనున్నారు. ఆయన కూతురు పాత్రను శ్రీలీల పోషించనుంది. మరో కీలక పాత్ర కోసం బాలీవుడ్‌ భామ సోనాక్షి సిన్హాను సంప్రదిస్తున్నట్లు సమాచారం

ఇదీ చూడండి: కొత్త బిజినెస్​లోకి మహేశ్!​.. మరి ఈ స్టార్స్​ ఏఏ వ్యాపారాల్లో రాణిస్తున్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.