ETV Bharat / entertainment

గూగుల్​పై అమితాబ్​ బచ్చన్​ ఫ్యామిలీ కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు! - దిల్లీ హైకోర్టులో ఆరాధ్య బచ్చన్​ కేసు

దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన బాలీవుడ్​ హీరో అభిషేక్​ బచ్చన్​ కుమార్తె ఆరాధ్య బచ్చన్​కు ఊరట లభించింది. ఆరాధ్య పిటిషిన్​పై విచారణ జరిపిన.. కోర్టు గూగుల్​కు నోటీసులు జారీ చేసింది.

aaradhya bacchan
aaradhya bacchan
author img

By

Published : Apr 20, 2023, 12:39 PM IST

Updated : Apr 20, 2023, 1:57 PM IST

తనపై వస్తున్న ఫేక్​ న్యూస్​లను కట్టడి చేసేందుకు దిల్లీ కోర్టును ఆశ్రయించిన బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​ మనమరాలు, అభిషేక్​ బచ్చన్​ కుమార్తె ఆరాధ్య బచ్చన్​కు ఊరట లభించింది. ఆరాధ్య దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ జరిపిన దిల్లీ హైకోర్టు.. గూగుల్ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. ఐటీ నిబంధనలను కట్టుబడి ఉండాలని ఆదేశించింది. అన్ని నిబంధనలను పాటించాలని నోటీసులు జారీ చేసింది.

దిల్లీకి చెందిన పలు యూట్యూబ్ ఛానళ్లతో పాటు, టాబ్లాయిడ్లు గత కొద్ది రోజులుగా ఆరాధ్య బచ్చన్​ గురించి వరుస కథనాలు ప్రచురిస్తూ వస్తున్నాయి. వాటన్నింటిలోనూ వాస్తవాల కంటే ఊహాగానాలకే ఎక్కువ ఉన్నాయని.. అంతే కాకుండా తన ఆరోగ్యంతో పాటు వ్యక్తిగత జీవితం గురించి పలు కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు.. ఇలాంటి తప్పుడు వార్తలను జనాల్లోకి తీసుకెళ్తున్న సంస్థలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో చిన్నారి ఆరాధ్య చేత దిల్లీ కోర్టులో పిటిషన్​ దాఖలు చేయించారు. తన ఆరోగ్యంపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన యూట్యూబ్, టాబ్లాయిడ్లపై దిల్లీ హైకోర్టుకు ఫిర్యాదు చేసింది. మైనర్​ అయినందున.. తనపై ఇలాంటి మీడియా కవరేజీపై నిషేధం విధించాలని అభ్యర్థించింది. ఆరాధ్యకు సంబంధించిన అన్ని వీడియోలను తొలగించాలంటూ.. పది సంస్థల పేర్లను ఆమె పిటిషన్​లో పేర్కొంది. ఈ కేసులో ఇప్పుడు గూగుల్​ LLCతో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (గ్రీవెన్స్ సెల్)ల పేర్లు కూడా ఉన్నాయి.

సోషల్ మీడియాలోనూ ఇటీవలే ఆరాధ్య బచ్చన్​పై వచ్చిన ట్రోల్స్​పై కూడా అభిషేక్ స్పందించారు. 'బాబ్ బిస్వాస్' అనే సినిమా ప్రమోషన్లలో ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఈ ట్రోల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మేము అంగీకరించం. ఇలాంటివి చేసేవారిని క్షమించాల్సిన అవసరం లేదు. నేను స్టార్​ను అయినంత మాత్రాన ఈ రంగానికి అస్సలు సంబంధంలేని నా కూతురిని టార్గెట్ చేస్తారా? నన్ను ఏమైనా అనాలనుకుంటే నా ముఖం మీద అనండి" అంటూ సీరియస్ అయ్యారు.

బాలీవుడ్ ముద్దుగుమ్మ ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ఏప్రిల్ 20, 2007లో వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ముంబయిలోని అమితాబ్ నివాసం ప్రతీక్షలో ఈ వివాహ వేడుక జరిగింది. కొద్దిమంది అతిథులు, బంధుమిత్రుల సమక్షంలో వేడుకలు నిర్వహించారు. వారికి పెళ్లైన నాలుగు సంవత్సరాల తర్వాత.. నవంబర్ 16, 2011 న అమ్మాయి జన్మించింది. ఆమెకు ఆరాధ్య అని పేరు పెట్టారు.

Last Updated : Apr 20, 2023, 1:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.