ETV Bharat / entertainment

మణిరత్నం సినిమాను రిజెక్ట్​ చేసిన అమలాపాల్​.. కారణమిదే - మణిరత్నం కొత్త చిత్రం

Mani Ratnam Ponniyin Selvan Movie : ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న కొత్త సినిమా 'పొన్నియిన్ సెల్వన్'. అయితే ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చినా.. కాదనుకుందట నటి అమలా పాల్​. ఈ విషయమై ఆమెను ప్రశ్నించగా.. ఈ విధంగా బదులిచ్చింది.

amala paul maniratnam movie
amala paul on rejecting mani ratnam new movie ponniyin selvan
author img

By

Published : Sep 12, 2022, 10:37 PM IST

Mani Ratnam Ponniyin Selvan Movie : మణిరత్నం పిలిచి మరీ అవకాశం ఇస్తానంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. తమ కెరీర్‌లో ఒక్కసారైనా ఆయన చిత్రంలో నటించాలని ఆశిస్తారు. పాత్ర చిన్నదా? పెద్దదా? అన్నది అస్సలు ఆలోచించరు. కానీ, అమలపాల్‌ మాత్రం మణిరత్నం చిత్రంలో చేయనని చెప్పిందట. అందుకు తానేమీ బాధపడటం లేదని కూడా చెప్పటం విశేషం. ఆయన దర్శకత్వంలో విక్రమ్‌, కార్తి, జయంరవి కీలకపాత్రల్లో రూపొందిన భారీ బడ్జెట్‌ చిత్రం 'పొన్నియిన్‌ సెల్వన్‌'. సెప్టెంబరు 30న ఈ చిత్రం విడుదల కానుంది.

ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమలపాల్‌ మాట్లాడుతూ.. "మణి సర్‌కు నేను పెద్ద అభిమానిని. ఆయన నన్ను పిలవగానే చాలా ఉత్సాహంగా అనిపించింది. మొదటిసారి ఆడిషన్‌ చేసిన తర్వాత ఆయన అనుకున్న పాత్రకు నప్పలేదు. నాకు చాలా బాధగా అనిపించింది. ఆ తర్వాత 2021లో అదే ప్రాజెక్టు కోసం మళ్లీ నన్ను పిలిచారు. అయితే, తాను ఆ పాత్ర చేసే మానసిక స్థితిలో లేనని చెప్పా. అందుకే ఆ అవకాశాన్ని వదులుకున్నా. 'మీరు ఆ పాత్ర చేయనందుకు విచారం వ్యక్తం చేస్తున్నారా' అని నన్ను ప్రశ్నిస్తే, కచ్చితంగా కాదని చెబుతా. ఎందుకంటే కొన్ని విషయాలు అంతే." అని చెప్పుకొచ్చింది.

పీరియాడిక్‌ డ్రామాగా 'పొన్నియిన్‌ సెల్వన్‌' రూపొందింది. విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ్ల, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు నటిస్తున్నారు.

ఇవీ చదవండి: 'నాకు పిల్లల్ని కనాలనుంది.. పెళ్లి అవ్వకపోయినా మా అమ్మకు ఓకే'

విజయ్‌ కొత్త సినిమా అప్డేట్​.. ప్రముఖ నిర్మాణ సంస్థ 100వ ప్రాజెక్టుగా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.