ETV Bharat / entertainment

మా తాత నేను పనికిరానని అనుకున్నారు.. కానీ ఈరోజు..: అల్లు అర్జున్‌ - అల్లురామలింగయ్య శత జయంతి

తాను జీవితంలో ఎందుకు పనికిరారని తన తాతయ్య అల్లు రామలింగయ్య భావించినట్లు గుర్తుచేసుకున్నారు హీరో అల్లుఅర్జున్​. ఇంకా ఏం అన్నారంటే..

alluarjun
అల్లుఅర్జున్​
author img

By

Published : Oct 2, 2022, 12:26 PM IST

'మా తాతయ్య అల్లు రామలింగయ్య.. నేను జీవితంలో ఎందుకూ పనికిరాను అనుకున్నారు. ఇవాళ ఆయన ఉండి ఉండే నా ఎదుగుదలని చూసుండేవారు' అని అన్నారు హీరో అల్లుఅర్జున్​. తన కోసం ఆయన రూ.10లక్షలు జమ చేసి ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. కాగా, అల్లు రామలింగయ్య శత జయంతిని పురస్కరించుకొని 'అల్లు రామలింగయ్య' పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం రాత్రి హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలోనే బన్నీ మాట్లాడుతూ.. "నాకు 16 ఏళ్లు వచ్చేవరకూ తాతయ్య, నానమ్మలతోనే ఉన్నాను. తాతయ్య చనిపోయాక రూ.10 లక్షల ఇన్స్యూరెన్స్‌ డబ్బు వచ్చింది. అయితే ఆ డబ్బు నాకు మాత్రమే వచ్చింది. ఆయన ఎందుకిలా చేశారు..? అని బీమా కట్టిన సంవత్సరాన్ని చూశా. తాతయ్య డబ్బు జమ చేయడం మొదలు పెట్టిన సమయంలో నేను నాలుగో తరగతి చదువుతున్నా. వీడు జీవితంలో ఎందుకూ పనికిరాడు. 18 ఏళ్ల వయసు వచ్చాక ఈ పది లక్షలు వాడికి ఏదో ఒక రూపంలో ఉపయోగపడతాయని ఆయన భావించి ఈ డబ్బు నా కోసమే జమ చేశారు. ఆయన దృష్టిలో ఎందుకూ పనికి రాని నేను.. ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను. అందుకు ఆనందిస్తున్నా. ఆయన కూడా నా ఎదుగుదలను చూసి ఉంటే బాగుండేది" అని తెలిపారు.

alluarjun
అల్లు రామలింగయ్య శతజయంతి

ఇక చిరంజీవి మాట్లాడుతూ.. "అల్లు రామలింగయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి. ‘మనవూరి పాండవులు’ సినిమా వల్ల మేమిద్దరం మొదటిసారి కలిశాం. ఆయన్ని చూసినప్పుడు 'ఈయనేంటి ఇంత సీరియస్‌గా ఉన్నారు' అనుకున్నా. అదే రోజు షూటింగ్‌ పూర్తి కాగానే "బాబు నీ పేరేంటి? మీ ఊరు ఎక్కడ?" అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ రోజు నుంచి ఆయన దృష్టి నాపైనే ఎక్కువగా ఉండేది. కానీ, (సురేఖతో వివాహాన్ని ఉద్దేశిస్తూ) ఆ తర్వాతనే తెలిసింది ఆయన నన్నెందుకు అంతలా గమనించారో. ఆయనతోపాటు అరవింద్‌, 'మనవూరి పాండవులు' నిర్మాత జయకృష్ణ కూడా కలిశారు. నన్ను ఎలాగైనా సురేఖకు ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధమయ్యారు. ఓసారి జయకృష్ణ మా ఇంటికి వెళ్లి నాన్నతో మాట్లాడారు. దాంతో, మా నాన్న కూడా పెళ్లి చేసేయడానికి ఫిక్స్‌ అయ్యారు. బలివ్వడానికి గొర్రెను తీసుకువెళ్లినట్టు నన్ను పెళ్లికి సిద్ధం చేశారు. పెళ్లి చూపుల తర్వాత ఓసారి మామయ్య ఇంటికి రమ్మని పిలిస్తే వెళ్లాను.. మొదటిసారి సురేఖ పెట్టిన కాఫీ తాగాను. ఆ రోజు ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఓకే అని చెప్పాను. నా పెళ్లికి కూడా పెద్ద తతంగమే జరిగింది. వరుస షూటింగ్‌ల మధ్య మూడే రోజులు బ్రేక్‌ తీసుకొని పెళ్లి చేసుకున్నా. చిరిగిన షర్ట్‌తోనే సురేఖ మెడలో తాళి కట్టా. ఆ రోజు అల్లు రామలింగయ్య ముఖం ఆనందంతో వెలిగిపోయింది" అని అన్నారు.

ఇదీ చూడండి: కలెక్షన్స్​లో దూసుకెళ్తున్న 'పొన్నియన్​ సెల్వన్'​.. రెండు రోజుల్లో ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.