ETV Bharat / entertainment

Balakrishna Movies : 'భగవంత్​ కేసరి' తర్వాత నటసింహం లైనప్ ఇదే.. బాలయ్య ఫుల్​ జోష్​లో ఉన్నారుగా! - బాలకృష్ణ బాబీ మూవీ

Balayya Movies List : టాలీవుడ్​ స్టార్​ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్​ కేసరి సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నారు. 90స్​ నుంచి ఇప్పటి వరకు తన నటనతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ స్టార్​ హీరో త్వరలో వరుస సినిమాలతో బిజీ కానున్నారు. ఆయన లైనప్​ ఓ సారి చూస్తే..

balakrishna upcoming movies
balakrishna upcoming movies
author img

By

Published : Jun 21, 2023, 12:30 PM IST

Balakrishna Movies : నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం అనిల్​ రావిపుడి దర్శకత్వం వహిస్తున్న 'భగవంత్ కేసరి' సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్​ దశలో ఉన్న ఈ సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అప్పట్లో వచ్చిన పోస్టర్​తో పాటు ఇటీవలే రిలీజైన టీజర్​ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేస్తున్నాయి. అంతే కాకుండా బాలయ్య కూడా మునుపెన్నడు లేని లుక్​లో కనిపించి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. కాజల్​, శ్రీలీల లాంటి స్టార్స్​ నటించిన ఈ సినిమాను, దసరా పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఓ వైపు ఈ సినిమా షూటింగును పూర్తిచేసుకుంటూ ఉండగానే, బాలయ్య మరో నలుగురు దర్శకులకు ఓకే చెప్పారు. దీంతో 'భగవంత్​ కేసరి' తర్వాత ఆయన లైనప్​ భారీగా ఉంది.

Bhagawant Kesari Movie : 'భగవంత్ కేసరి' తరువాత వాల్తేర్​ వీరయ్య దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఓ సినిమాలో బాలయ్య లీడ్​ రోల్​ చేస్తున్నారు. యాక్షన్ థీమ్​తో నడిచే ఈ సినిమాను సితార నాగవంశీ - సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఆ తరువాత బాలయ్య-బోయపాటి క్రేజీ కాంబోలో ఓ సినిమా రూపొందనుంది. 14 రీల్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా.. పొలిటికల్ నేపథ్యంలో కొనసాగుతుందని సినీ వర్గాల టాక్​.

మరోవైపు 'బింబిసార' ఫేమ్​ డైరెక్టర్​ శ్రీ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఓ సినిమాకు కూడా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్​ . ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్​పై రూపొందనుందని సమాచారం​. ఇక ఆ తరువాత పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమాకు బాలయ్య సైన్​ చేయనున్నారని టాక్​. ఇంతే కాకుండా 'హనుమాన్'​ చిత్ర దర్శకుడు ప్రశాంత్​ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాకు బాలకృష్ణ ఓకే చెప్పారన్న టాక్​ నడుస్తోంది. ఈ చిత్రం 'హనుమాన్' తర్వాత సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం.

Aditya 999 Max : 90స్​ దశకంలో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బాలయ్య మూవీ 'ఆదిత్య 369'. సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్​ను షేక్​ చేసి రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ఈ సీక్వెల్‌కు కథను బాలయ్య రెడీ చేసుకున్నారని టాక్. ఈ చిత్రానికి 'ఆదిత్య 999 మాక్స్' అనే టైటిల్ కూడా కన్ఫామ్ చేశారట. 'భగవంత్​ కేసరి' తర్వాత బాలయ్య లైనప్​ విన్న అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. ఈ సినిమాలన్నీ సెట్స్​పైకి వెళ్లేందుకు కాస్త సమయమే పట్టనుంది. అయినప్పటికీ ఈ సినిమాలన్నీంటిలోనూ బాలయ్య ఉన్నందున ఎన్ని రోజులైనా వెయిట్​ చేస్తామంటూ అభిమానులు సోషల్​ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.