ETV Bharat / entertainment

Adipurush Update: 'ఆదిపురుష్‌' అదిరిపోయే అప్డేట్.. సంక్రాంతి సమరానికి రెడీ! - ప్రభాస్​ పుట్టినరోజు

పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ నటించిన 'ఆదిపురుష్‌' సినిమా నుంచి మరో అప్డేడ్​ రాబోతోంది. ప్రభాస్ పుట్టిన రోజైన అక్టోబర్ 23న ఈ అప్డేట్​ను సినిమా యూనిట్ ప్రకటించనుంది. అదేంటంటే..

Adipurush Update
Adipurush Update
author img

By

Published : Oct 22, 2022, 9:57 AM IST

ఈ సంక్రాంతికి 'ఆదిపురుష్‌'గా సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు ప్రభాస్‌. త్రీడీలో రూపొందిన ఈ భారీ బడ్జెట్‌ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా ప్రభాస్‌ పుట్టినరోజు పురస్కరించుకొని ఆదివారం ఈ చిత్రం నుంచి ఓ పాట విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ గీతానికి సంబంధించిన పనులు ఇప్పటికే పూర్తయ్యాయని.. ఇది చక్కటి గ్రాఫిక్స్‌ హంగులతో ఆకట్టుకునేలా ఉంటుందని టాక్‌ వినిపిస్తోంది. రామాయణం ఇతివృత్తంగా ఓం రౌత్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రమిది. ఇందులో రాముడి పాత్రను ప్రభాస్‌ పోషించగా.. సీత పాత్రలో కృతి సనన్‌ నటించింది. లంకేశుడి పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ కనిపించనున్నారు.

కేజీఎఫ్​ దర్శకుడు ప్రశాంత్​ నీల్, ఫ్రభాస్​​ కలయికలో వస్తున్న మరో చిత్రం 'సలార్​'. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఫ్రభాస్​ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్​ 23న కచ్చితంగా 'సలార్​' చిత్రం నుంచి ఏదైనా అప్డేట్​ వస్తుందని సినీ వర్గాల సమాచారం. కానీ దీనిపై అధికారికంగా చిత్ర యూనిట్​ ప్రకటించలేదు.

Adipurush Update
సలార్

ఈ సినిమాతో పాటు ప్రభాస్​ మరో చిత్రం ఖరారైంది. మారుతి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించనుంది. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా.. ఇప్పుడు రెగ్యులర్‌ చిత్రీకరణకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే కథానాయికల్ని ఖరారు చేసే పనిలో పడింది చిత్ర బృందం. కథ రీత్యా ఇందులో ముగ్గురు నాయికలకు అవకాశముందని తెలిసింది.

ఇందులో రెండు పాత్రల కోసం నిధి అగర్వాల్, మాళవికా మోహనన్‌ పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం మరో నాయికను త్వరలో ఫైనల్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. హారర్‌ అంశాలతో నిండిన విభిన్నమైన కథతో ఈ చిత్రం రూపొందనుందని టాక్‌. ఓ చిన్న షెడ్యూల్‌తో వచ్చే వారంలో రెగ్యులర్‌ చిత్రీకరణకు శ్రీకారం చుట్టనున్నారని తెలిసింది. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌ లేని కొన్ని కీలక సన్నివేశాల్ని చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి : జపనీస్‌లో మాట్లాడిన ఎన్టీఆర్‌.. ఫ్యాన్స్​ సర్​ప్రైజ్​

సంక్రాంతి బరిలో బాలయ్య.. 'ఎన్​బీకే 107'కు పవర్​ఫుల్​ టైటిల్​ ఫిక్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.