ETV Bharat / entertainment

ప్రభాస్​ ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్​..'ఆదిపురుష్'​ కొత్త అప్డేట్​ వచ్చేసింది! - adipurush controversy hanuman

పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్​ అభిమానులందరూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సినిమా 'ఆదిపురుష్'. శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్​ ఇచ్చింది చిత్ర యూనిట్​. అది ఏంటంటే.. adipurush teaser 2 release date

adipurush update on srirama navami 2023 adipurush

author img

By

Published : Mar 30, 2023, 8:34 AM IST

Updated : Mar 30, 2023, 9:49 AM IST

పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ నటిస్తున్న సినిమా 'ఆదిపురుష్'​. శ్రీరామ నవమి సందర్భంగా ఈ చిత్రం నుంచి మరో అప్డేట్​ ఇచ్చింది సినిమా యూనిట్​. 'ఆదిపురుష్'​ కొత్త పోస్టర్​ను విడుదల చేసింది. ఈ మేరకు 'ఆదిపురుష్'​ డైరెక్టర్​ ఓం రౌత్​ ట్విట్టర్​లో పోస్టు చేశారు. దాంతోపాటు 'మంత్రం కన్నా గొప్పది నీ నామం.. జై శ్రీరామ్' అని రాసుకొచ్చారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో.. జూన్​ 16న ప్రపంచవ్యాప్తంగా 'ఆదిపురుష్' విడుదల కానుంది. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్​ నటించగా.. సీత పాత్రలో కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్​ నటించారు. ఇక, సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్ర పోషించారు. కాగా, ఈ సినిమా రెండో టీజర్​ కూడా శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేయనున్నారని సినీ వర్గాల సమాచారం. ఈ విషయాన్ని చిత్ర యూనిట్​ అధికారికంగా ప్రకటించలేదు.

adipurush update on srirama navami 2023 adipurush
ఆదిపురుష్​

'ఆదిపురుష్​'కు అడ్డంకులు..
రామాయణం ఆధారంగా 'ఆదిపురుష్‌' తెరకెక్కుతోంది. గతేడాది దసరా వేడుకల్లో భాగంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. అనూహ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఈ చిత్రంపై ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తాము ఊహించిన స్థాయిలో టీజర్‌ లేదని.. రావణాసురుడు, హనుమంతుడి లుక్స్‌, వీఎఫ్‌ఎక్స్‌ బాగోలేదని విమర్శలు చేశారు. 'ఆదిపురుష్' సినిమా మొత్తం యానిమేషన్​లా ఉందని ట్రోల్​ చేశారు. ముఖ్యంగా రావణుడి, ఆంజనేయుడి పాత్రలను వక్రీకరించినట్లు సోషల్​ మీడియాలో కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో తోలు వస్తువులు ఉపయోగించినట్లు ఆరోపించారు. అంతే కాకుండా, ఈ సినిమాకు అప్పట్లో బాయ్​కాట్​ సెగ కూడా తాకింది. దీంతో సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. వెనక్కు తగ్గిన 'ఆదిపురుష్' టీమ్​.. దిద్దుబాటు చర్యలు చేపట్టి.. చిత్రాన్ని రీషూట్​ చేసింది. దీనికోసం ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు పెట్టి మరోసారి వీఎఫ్‌ఎక్స్‌, సీజీ పనులు చేయిస్తోందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఈ ఆరోపణలతోనే 'ఆదిపురుష్'​ సినిమా విడుదలను వాయిదా వేయాలని దిల్లీ కోర్టులో పిటిషన్​ కూడా దాఖలైంది. ఈ మేరకు 'ఆదిపురుష్​' నిర్మాత భూషణ్​ కుమార్​, డైరెక్టర్ ఓం రౌత్ మీద.. అడ్వకేట్​ రాజ్​ గౌరవ్ పిటిషన్​ వేశారు. 2021లో 'ఆదిపురుష్​' షూటింగ్​ సెట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో ప్రభాస్​, సైఫ్​ అలీఖాన్ సెట్లో లేరు.​ ప్రమాద సమయంలో దర్శకుడు ఓం రౌత్, ఇతర సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఆ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇన్ని అడ్డంకులు ఎదురు కావడం వల్ల.. ఈసారైనా అనుకున్న సమయానికి 'ఆదిపురుష్​' థియేటర్లలో దర్శనం ఇస్తాడో లేదో అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Mar 30, 2023, 9:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.