ETV Bharat / entertainment

ఆ రూమర్స్‌కు చెక్‌ పెట్టిన సాయిపల్లవి.. ఏమందంటే? - sai pallavi gives clarity on rumors

'ఫిదా' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి అద్భుతమైన నటనతో అందరినీ ఆశ్చర్యపరచింది సాయిపల్లవి. తాజాగా ఈ అమ్మడు సినిమాలకు స్వస్తి చెప్పిందని జరుగుతున్న ప్రచారంపై స్పందించింది.

sai pallavi rumors
sai pallavi rumors
author img

By

Published : Jan 9, 2023, 7:11 AM IST

Updated : Jan 9, 2023, 7:17 AM IST

సహజమైన అందంతో అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకునే హీరోయిన్‌ సాయిపల్లవి. ఈ అమ్మడి గురించి ఇటీవల కాలంలో సోషల్‌మీడియాలో చాలా రూమర్స్‌ వస్తున్నాయి. ఎన్నో సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ సినిమాలకు గుడ్‌బై చెప్పనుందని.. డాక్టర్‌గా స్థిరపడడం కోసం హాస్పిటల్‌ నిర్మించే పనిలో ఉందనే వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. తాజాగా ఈ విషయంపై మాట్లాడిన సాయిపల్లవి రూమర్స్‌కు చెక్‌ పెట్టింది.

'ప్రేమమ్‌ సినిమాతో నా సినీప్రయాణం మొదలైంది. ఆ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని నేను ఊహించలేదు. ఆ చిత్రంలో నేను చేసిన పాత్రకు ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అయ్యారు. నా పేరు చెప్పగానే గుర్తొచ్చే పాత్రల్లో అది ఒకటి. నేను ఎంబీబీఎస్‌ చదివినా.. నటిని కావాలనుకున్నాను. నా నిర్ణయానికి మా తల్లిదండ్రులు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. నేను నటించిన సినిమాలు ప్రేక్షకులకు నచ్చాలని అనుకుంటాను. నా పాత్రలు వాళ్లకి ఎప్పటికీ గుర్తుండాలని భావిస్తాను. నన్ను అందరూ తమ ఇంటి ఆడపడుచుగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. మంచి కథలు ఉంటే ఏ భాషలో అయినా నటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను' అంటూ తన సినిమాల గురించి వస్తున్న రూమర్స్‌ కొట్టిపారేసింది ఈ బ్యూటీ.
గతేడాది విరాటపర్వం, గార్గి సినిమాతో సాయి పల్లవి సందడి చేసింది. తాజాగా రణ్‌బీర్‌ కపూర్‌ సరసన నటించనుందనే వార్తలు వస్తున్నాయి. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయిపల్లవి సీతగా అలరించనుందని అంటున్నారు.

Last Updated : Jan 9, 2023, 7:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.