'అటెండెన్స్ రిజిస్టర్‌లో ఉన్న ప్రతి స్టూడెంట్ క్లాస్ రూమ్‌లో ఉంటాడు. ఛాలెంజ్ చేసి చెబుతున్నా' అంటున్నారు తమిళ స్టార్ హీరో ధనుశ్. ఆయన కీలక పాత్రలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సార్'. సంయుక్త మేనన్ కథానాయిక. బుధవారం ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలను ప్రస్తావిస్తూ సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. కాగా, ఫిబ్రవరి 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్ విడుదల వేడుకను బుధవారం నిర్వహించారు.
ధనుష్ మాట్లాడుతూ.."నేను నేరుగా తెలుగులో నటించిన తొలి చిత్రమిది. ఈ సినిమా వేడుకలో మీ అందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు నాకెంతో ప్రత్యేకం. నిన్నమొన్నటి వరకు తమిళ్ సినిమా, తెలుగు సినిమా, కన్నడ సినిమా.. ఇలా పలు రకాలుగా పిలిచేవారు. ఇప్పుడు అవేవీ లేవు. ఒక్క ఇండియన్ ఫిల్మ్ అనేదే ఉంది. సార్ చిత్రంలో నటించే అవకాశం నాకు ఇచ్చినందుకు వెంకీ అట్లూరి, త్రివిక్రమ్, నాగవంశీలకు థాంక్స్" అని ధనుష్ అన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మీమ్ చూసి ప్రేమకథలు తీయకూడదనుకున్నా: వెంకీ
"నేను మీమ్స్ ఎక్కువగా ఫాలో అవుతా. నా 'రంగ్ దే' విడుదలైన తర్వాత వచ్చిన ఓ మీమ్ నన్ను ఆలోచింపజేసింది. ‘నారప్ప’ చిత్రాన్ని ఒకవేళ నేను తీస్తే, అది కూడా సెకండాఫ్ లండన్‌లో సాగుతుందనేదే ఆ మీమ్. 'ఇక చాలు. లవ్‌స్టోరీలు చేయకూడదు' అని దాన్ని చూశాక ఫిక్స్ అయ్యా. కొవిడ్ సెకండ్ వేవ్‌లో 'సార్' కథ రాసి, నాగవంశీకి వినిపించా. ఆ తర్వాత ధనుష్‌ను కలిశా. ఆయన నా స్టోరీ వింటే చాలు నటించేందుకు ఎస్ చెప్పినా, నో చెప్పినా ఫర్వాలేదనుకున్నా. వినడం పూర్తయిన తర్వాత డేట్స్ ఎప్పుడు కావాలి అని ఆయన అడగడంతో సర్‌ప్రైజ్‌గా ఫీలయ్యా. ధనుష్- సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్ కాంబినేషన్‌లో ఇప్పటికే ఎన్నో హిట్ పాటలొచ్చాయి. ఈ సినిమాలోని పాటలు ఎంత బాగుంటాయో నేపథ్య సంగీతం అంతకంటే బాగుంటుంది. దాని గురించి మీరంతా ప్రత్యేకంగా మాట్లాడతారు. సంయుక్తా మేనన్ ఈ సినిమాలోని మీనాక్షి పాత్రలో ఒదిగిపోయింది. హైపర్ ఆది ఈ సినిమాతో కోలీవుడ్‌లో కూడా బాగా పాపులర్ అవుతాడనే నమ్మకం నాకుంది" అని వెంకీ అట్లూరి తెలిపారు. సంయుక్తా మేనన్, ఆది, నాగవంశీ తదితరులు పాల్గొన్నారు.