7 Days 6 Nights Director MS Raju: "ఉద్యోగ విరమణ తర్వాత చాలామంది తాము అలసిపోయామనీ, విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు. నాలో మాత్రం రోజురోజుకీ ఉత్సాహం పెరుగుతోంది. ఆ తపనతోనే ఈ సినిమా తీశా" అన్నారు ప్రముఖ దర్శకనిర్మాత ఎం.ఎస్.రాజు. 'డర్టీ హరి'తో నవతరాన్ని మెప్పించిన ఆయన ఇటీవల దర్శకత్వం వహించిన చిత్రమే
'7 డేస్ 6 నైట్స్'. సుమంత్ అశ్విన్, రోహన్ కథా నాయకులుగా నటించారు. చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా ఎం.ఎస్.రాజు విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
"తొలిరోజు థియేటర్లకి వచ్చేది యువతరమే. ఆ తర్వాత కుటుంబ ప్రేక్షకులొస్తారు. నిన్నటిలో ఉండిపోకుండా, రేపటితరం సినిమాల్ని తీసినప్పుడే యువతరాన్ని మెప్పించగలం. నా ఆలోచనలు ఎప్పుడూ అదే తరహాలోనే ఉంటాయి. 'డర్టీహరి' తర్వాత కథల గురించి ఆలోచిస్తున్నప్పుడు రాజ్‌కపూర్ 'బర్సాత్' చూశా. అందులో రెండు ప్రధాన పాత్రలు బాగా నచ్చాయి. వాటిని స్ఫూర్తిగా తీసుకొని ఓ కొత్తతరం కథ సిద్ధం చేయాలనుకున్నా. అలా మొదలైందే ఈ సినిమా ప్రయాణం.
సంక్లిష్టతతో కూడిన ఓ కథని రాశా. మరీ యువ ఆలోచనలతో కూడిన ఈ సినిమాకి ఎలాంటి సన్నివేశాలు, సంభాషణలు రాయాలి? నేనేమో యువకుడిని కాదు. అందుకే ఈ ప్రశ్న మొదలవగానే ఇంట్లో చెప్పకుండా ఒక్కడినే కార్ డ్రైవ్ చేసుకుంటూ గోవా బయల్దేరా. ఐదారు రోజలు అంతా తిరిగా. గోవాలో భిన్న ప్రాంతాలకి చెందిన యువతరం కనిపిస్తారు. వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో, ఎలా నడుచుకుంటున్నారో గమనించా. కొన్ని సమూహాల్ని నేను అనుసరిస్తున్నప్పుడు కిడ్నాప్ చేయడానికి వచ్చాడా ఏంటి? అన్నట్టుగా అనుమానంగా చూశారు (నవ్వుతూ). ఇలాంటి రేపటితరం సినిమాలు చేస్తున్నప్పుడు ఈ రకమైన పరిశోధన చాలా అవసరం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీచూడండి: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా: ఆకాశ్ పూరి