కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని గ్రామాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. జమ్మలమడుగు డీఎస్పీ కృష్ణం ఆధ్వర్యంలో పోలీసులు కవాతు చేశారు. గొరిగనూరు, ధర్మాపురం, సుగుమంచిపల్లి, పెద్దడండ్లూరు, సున్నపురాళ్లపల్లి, దేవగుడి, జమ్మలమడుగు వంటి సమస్యాత్మక ప్రాంతాలలో భద్రత దళాలు పహారా పెంచామని డీఎస్పీ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని తెలిపారు.
ఇవీ చూడండి : సార్వత్రిక సమరానికి సర్వం సిద్ధం: ద్వివేది