తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికలను పురస్కరించుకుని.. కౌంటింగ్ కేంద్ర వద్ద పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశామని తిరుపతి అర్భన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు తెలిపారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషాతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద యాక్ట్ 30, 144 సెక్షన్ అమలులో ఉంటాయన్నారు.
కౌంటింగ్ కేంద్రం వద్ద అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గెలిచిన అభ్యర్థుల వర్గాలు బాణాసంచా కాల్చటం, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించటంపై నిషేధం ఉంటుందన్నారు.
ఇదీ చదవండి: