ETV Bharat / crime

ప్రేమ పెళ్లికి పెద్దల నిరాకరణ... యువతి ఆత్మహత్య.. ప్రియుడేమో! - నెల్లూరు జిల్లాతాజా వార్తలు

వారిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు. యువతిపై ఇష్టం పెంచుకున్న యువకుడు పెళ్లి చేసుకునేందుకు ఆమె పెద్దలతో మాట్లాడాడు. వారి నుంచి నిరాకరణ ఎదురైంది. ఆ తరువాత ఏమైందో తెలియదు గానీ యువతి బావిలో దూకి ఆత్మహత్య చేసుకోగా.. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న యువకుడు మాత్రలు మింగి, బ్లేడుతో గొంతు, శరీరంపై కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం పుల్లాయపల్లిలో జరిగింది.

Young woman commits suicide for refusing to marry
పెళ్లికి నిరాకరించారని యువతి ఆత్మహత్య
author img

By

Published : Feb 22, 2021, 7:40 PM IST

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం పుల్లాయపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పుల్లాయపల్లె గ్రామానికి చెందిన నజ్మా(18) అనే యువతి బావిలో దూకి ఆత్మహత్య చేసుకోగా..ఆమెను పెళ్లి చేసుకుందామనుకున్న యువకుడు బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

గ్రామానికి చెందిన నజ్మా, ఇమామ్ ఖాసీం ఒకరినొకరు ఇష్టపడ్డారు. నజ్మాను పెళ్లి చేసుకుంటానని ఇమామ్ ఖాసీం నజ్మా కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. అందుకు వారు అంగీకరించలేదు. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు గానీ.. ఆదివారం రాత్రి పశువులకు మేత వస్తానని చెప్పి.. నజ్మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఆమె కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఉదయాన్నే వెతికారు. గ్రామ సమీపంలో ఉండే పంట పొలాల్లోని బావి వద్ద పాదరక్షలు, చున్నీ ఉండడంతో ఆమె బావిలో దూకి ఉంటుందని భావించారు. స్థానికుల సహాయంతో నజ్మా మృతదేహం కోసం బావిలో వెతికి.. సాయంత్రానికి బయటికి తీశారు.

నజ్మా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని తెలుసుకున్న ఇమామ్ ఖాసీం తాను ఎంతో ఇష్టపడిన యువతి ఇక లేదని తెలుసుకుని.. కడప జిల్లా గోపవరం మండలం పీపీ కుంట సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లి మాత్రలు మింగాడు. అలాగే బ్లేడుతో గొంతు, కాళ్లు, చేతులపై కోసుకొని గ్రామస్థులకు ఫోన్ చేసి విషయాన్ని తెలిపాడు. స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని బద్వేల్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఉదయగిరి ఎస్సై మరిడి నాయుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న నజ్మా మృతదేహాన్ని వెలికి తీయించి జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఒకరి అజాగ్రత్త.. మరొకరి అతివేగం.. ఫలితం రోడ్డుప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.