ATTACK: గుంటూరు జిల్లా తాడికొండ మండలం లామ్ గ్రామంలో అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు చేసినందుకు తెలుగుదేశం నేత సుభానిపై వైకాపా వర్గీయులు దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన సుభాని గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. బాధితుడిని తెలుగుదేశం నేతలు తెనాలి శ్రావణ్ కుమార్, నసీర్ అహ్మద్ పరామర్శించారు. అక్రమాలపై ఫిర్యాదు చేస్తే దాడి చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం శ్రేణులపై దాడులకు పాల్పడేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తన తండ్రిపై దాడి చేసినవారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని బాధితుడి కుమార్తె డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: