Woman suicide attempt డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు పోలీసు సర్కిల్ ఆఫీస్ ఎదుట పెట్రోల్ పోసుకుని వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం గ్రామానికి చెందిన యర్రంశెట్టి విజయలక్ష్మిగా చెబుతున్న బాధితురాలు మలికిపురం మండలం ఇరుసుమండలోని తన భూమి విషయంలో స్థానికులు అడ్డు తగులున్నారని మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. తీవ్రగాయాలతో ఉన్న బాధితురాలను స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈమెకు భర్త రమేష్, కుమారుడు, కుమార్తె ఉన్నారని తెలిపింది.
ఇవీ చదవండి: