ETV Bharat / crime

ఫేస్​బుక్​ పరిచయం.. వివాహేతర సంబంధం.. కట్​ చేస్తే.. - నంద్యాలలో భర్తను హత్య చేసిన భార్య

Wife Killed Husband With Lover Help : ఫేస్​బుక్​ అనే వ్యసనం పచ్చని సంసారంలో నిప్పులు పోస్తోంది. చాలా మంది.. అపరిచితులతో పరిచయాలు పెంచుకుని వివాహేతర సంబంధాలకు పునాదులు వేస్తున్నారు. ఆ సంబంధానికి ఎవరైనా అడ్డుగా ఉన్నారని భావిస్తే చాలు.. వెనకా ముందు చూడకుండా ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే నంద్యాల జిల్లాలో జరిగింది. ఫేస్​బుక్​లో పరిచయమైన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఇక్కడే అసలు విషయం బయటపడింది..

Wife Killed Her Husband With Lover Help
Wife Killed Her Husband With Lover Help
author img

By

Published : Oct 26, 2022, 5:31 PM IST

WIFE KILLED HUSBAND : ఫేస్​బుక్​ పరిచయం.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ నేపథ్యంలోనే తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు కుట్ర పన్నారు. అనుకున్నట్లుగానే హత్య చేసి ఆపై అనుమానం రాకుండా ఉండేందుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగుచూసింది. ఈ ఘటన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలో కరీముల్లా అనే ఆటోడ్రైవర్​ ఈనెల 8వ తేదీన పట్టణ శివార్లలోని విద్యుత్ సబ్​స్టేషన్​ వద్ద గోనె సంచిలో మృతదేహంగా కనిపించాడు. తన భర్త చనిపోయాడంటూ పోలీసులకు అతని భార్య మున్ని ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించారు. ఆటో డ్రైవర్ కావడంతో ఇతర తగాదాలు, భూ వివాదాలు ఏమైనా హత్యకు దారి తీసి ఉంటాయనే కోణంలో భావించి విచారణ చేపట్టారు. అయితే ఈ ఘటనకు అసలు కారణం కరీముల్లా భార్య వివాహేతర సంబంధమేనని తేలింది. ఆమె కాల్​రికార్డ్స్​, సామాజిక మాధ్యమాల వినియోగంపై దృష్టి పెట్టిన పోలీసులు ఆ కోణంలో విచారించారు. దాంతో అసలు విషయం బయటపడింది.

ఫేస్​బుక్​లో వైఎస్సార్​ కడప జిల్లా పెద్దముడియం మండలానికి చెందిన వంశీకుమార్​ రెడ్డి అలియాస్​ పవన్​తో ఆమెకు వివాహేతర బంధం ఉందనే విషయం వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం తేటతెల్లమైంది. ఈ నెల ఆరో తేదీనే కరీముల్లాను.. ఇంట్లోనే గొంతుకు తాడు బిగించి భార్య, ఆమె ప్రియుడు హత్య చేశారని.. అనంతరం మృతదేహాన్ని ఒక గోనెసంచిలో పెట్టి.. ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్లి విద్యుత్ సబ్​స్టేషన్​ వద్ద పారేసినట్లు తేలిందని ఆళ్లగడ్డ డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు పేర్కొన్నారు.

ఫేస్​బుక్​ పరిచయం.. వివాహేతర సంబంధం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.