Wife Killed Husband : గుంటూరు జిల్లా మంగళగిరిలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. భార్యకు ప్రియుడికి మధ్య పెళ్లికి ముందున్న సన్నిహిత సంబంధం.. పెళ్లైనా తర్వాత కూడా కొనసాగటం హత్యకు దారి తీసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంగళగిరికి చెందిన వింజమూరు క్రాంతికుమార్ అనే యువకుడికి ఏలూరుకి చెందిన గంగా లక్ష్మితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. వివాహం కాకముందే గంగా లక్ష్మికి మరిడయ్య అనే వ్యక్తితో సంబంధం ఉందని స్థానికులు అంటున్నారు. వివాహం అనంతరం ఇది కొనసాగటంతో భార్యాభర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి.
శనివారం అర్ధరాత్రి గంగా లక్ష్మి ప్రియుడితో సన్నిహితంగా ఉండటం భర్త క్రాంతికుమార్ గమనించాడు. దీంతో భార్యతో గొడవకు దిగాడు. దీంతో భార్య గంగా లక్ష్మి ప్రియుడు మరిడయ్యతో కలిసి భర్త క్రాంతికుమార్‌ను హత్య చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. భార్య గంగా లక్ష్మి, ప్రియుడు మరిడయ్యతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి :