ETV Bharat / crime

వాలంటీర్​ను చంపేశారు.. ఇంత దారుణమా! - గుంటూరు జిల్లా తాజా వార్తలు

MURDER: తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకు వాలంటీర్​పై ఓ తండ్రీకొడుకులు దాడి చేశారు. దీంతో.. అతను అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. ఈ దారుణ సంఘటన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది.

MURDER
గుంటూరులో వాలంటీర్​ హత్య
author img

By

Published : May 20, 2022, 1:28 PM IST

MURDER: గుంటూరు జిల్లా తెనాలి మారిస్‌పేటలో దారుణం చోటు చేసుకుంది. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకు.. వాలంటీరుపై దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మారిస్​పేటలోని 24వ వార్డులో వాలంటీర్ గా సందీప్(22) పనిచేస్తున్నాడు. రోహిత్ అనే వ్యక్తికి సందీప్ 2 వేల రూపాయలు ఇచ్చాడు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని సందీప్ అడిగాడు.

దీంతో.. ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. ఈ క్రమంలోనే.. రోహిత్‌ తన తండ్రి వెంకటేశ్వర్లుతో కలిసి సందీప్‌పై దాడిచేశారు. గుండెపై బలంగా కొట్టడంతో సందీప్ అక్కడికక్కడే కుప్పకూలాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్లారు. అయితే.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని రోహిత్‌, అతని తండ్రి వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు. సందీప్ తండ్రి ఇది వరకే మృతిచెందగా, తల్లికి మాటలు రావు. దీంతో.. వాలంటీర్​గా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.