MINOR: గుంటూరు జిల్లాలో మహిళలు, బాలికపై అత్యాచారాలు, అసభ్యకర ప్రవర్తనలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా పెదనందిపాడు మండలంలోని పుసులూరు గ్రామంలో ఓ మైనర్ బాలిక పట్ల ఆనంద్ బాబు అనే వాలంటీర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు... వాలంటీర్ను అరెస్ట్ చేశారు. నిందితుడిని పోలీసులు కోర్టుకు తరలించే సమయంలో వాలంటీర్ తల్లి స్టేషన్ బయట సొమ్మసిల్లి పడిపోయింది.
ఇవీ చదవండి: