ETV Bharat / crime

YS Viveka Case: వైఎస్​ వివేకా కేసు.. వాచ్‌మ్యాన్‌ రంగన్న ఇచ్చిన వాంగ్మూలంలో విస్తుపోయే నిజాలు - AP News

Viveka Murder Case: వై.ఎస్‌. వివేకా హత్య ఘటనలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వివేకా ఇంట్లో వాచ్‌మ్యాన్‌గా పనిచేసే బి. రంగన్న మేజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంతో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. వివేకానందరెడ్డి ఇంటివద్ద రాత్రి కాపలాదారుగా పనిచేసే రాజశేఖర్‌ కాణిపాకం నుంచి ఎప్పుడు వస్తారో ఫోన్‌ చేసి కనుక్కోవాలంటూ ఎర్ర గంగిరెడ్డి తనను ఆదేశించారని రంగన్న తెలిపారు. ఆయన సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్‌ లేదంటూ.. తన ఫోన్‌ నుంచే రాజశేఖర్‌కు కాల్‌ చేసి మాట్లాడించారని పేర్కొన్నారు. అదే రోజు రాత్రి వివేకా హత్యకు గురయ్యారని చెప్పారు.

Viveka Murder Case
Viveka Murder Case
author img

By

Published : Feb 24, 2022, 7:05 AM IST

Viveka Murder Case: మాజీమంత్రి వివేకా హత్యే కేసులో ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. వై.ఎస్‌.వివేకానందరెడ్డి ఇంటివద్ద రాత్రి కాపలాదారుగా పనిచేసే రాజశేఖర్‌ కాణిపాకం నుంచి ఎప్పుడు వస్తారో ఫోన్‌ చేసి కనుక్కోవాలంటూ ఎర్ర గంగిరెడ్డి తనను ఆదేశించారని వివేకా ఇంట్లో వాచ్‌మ్యాన్‌గా పనిచేసే బి.రంగన్న వెల్లడించారు. ఆయన సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్‌ లేదంటూ.. తన ఫోన్‌ నుంచే రాజశేఖర్‌కు కాల్‌ చేసి మాట్లాడించారని తెలిపారు. మధ్య దారిలో బండి చెడిపోయిందని, మరమ్మతులు చేయించుకుని కాణిపాకం ఎప్పుడు చేరుతానో తెలియదంటూ రాజశేఖర్‌ సమాధానమిచ్చిన తర్వాత.. గంగిరెడ్డి ఆ ఫోన్‌ కాల్‌ కట్‌ చేసి సెల్‌ను తనకు ఇచ్చేశారని వివరించారు. 2019 మార్చి 14 ఉదయం ఈ ఘటనలు చోటుచేసుకోగా... అదే రోజు రాత్రి వివేకా హత్యకు గురయ్యారని చెప్పారు. కడప జిల్లా జమ్మలమడుగులోని ఫస్ట్‌క్లాస్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట గతేడాది జులై 23న రంగన్న వాంగ్మూలం ఇచ్చారు. ఆ ప్రతులు తాజాగా వెలుగుచూశాయి. ప్రధానాంశాలివే...

అరుపులు వినిపించాయి...

‘హత్య జరిగిన రోజు రాత్రి వివేకా పడక గదిలో నుంచి ఇనుప సామాన్ల శబ్దం వచ్చింది. అంతలోనే ‘ఆ.. ఆ..’ అంటూ పెద్దగా అరుపులు వినిపించాయి. ఆ సమయంలో వివేకా పడకగదిలో నుంచి హాల్లోకి ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, దస్తగిరితో పాటు మరో వ్యక్తి పదే పదే తిరుగుతూ కనిపించారు. అరుపులు వినిపించిన 20 నిమిషాల తర్వాత ఎర్ర గంగిరెడ్డి మినహా మిగతా ముగ్గురూ పారిపోయారు. తర్వాత కొద్దిసేపటికి ఎర్ర గంగిరెడ్డి ఆదరాబాదరాగా బయటకు వచ్చాడు. లోపల ఏం జరిగింది? వారు ముగ్గురు ఎందుకు పారిపోయారని ఆయన్ను ప్రశ్నించగా, ‘నీకెందుకు..ఎక్కువమాట్లాడితే నిన్ను నరుకతా’ అన్నారు. 2019 మార్చి 15న ఉదయం ఎర్ర గంగిరెడ్డి నన్ను పిలిచి.. రాత్రి జరిగింది ఎవరితోనైనా చెబితే నరికి పారేస్తానని బెదిరించారు. దాంతో నేను భయపడి ఎవరికీ చెప్పలేదు’ అని రంగన్న తన వాంగ్మూలంలో వివరించారు.

నన్ను వాళ్లేమైనా చేస్తారా..?

‘మీతో ఈ విషయం చెప్పినట్లు ఎర్ర గంగిరెడ్డితో పాటు వివేకాను చంపిన వారికి తెలిసిపోయుంటందా? వాళ్లు నన్నేమైనా చేస్తారా?’ అంటూ వాంగ్మూలం ఇచ్చిన సమయంలో రంగన్న మేజిస్ట్రేట్‌ను అడిగారు. ‘నీ బాగోగులు వ్యవస్థ చూసుకుంటుంది’ అంటూ మేజిస్ట్రేట్‌ ఆయనకు సమాధానమిచ్చారు. ‘వివేకానందరెడ్డి ధర్మదేవుడు సార్‌... అలాంటి ఆయన్ను చంపారు. పిల్లోడు పిలిచినా పలుకుతాడు’ అంటూ రంగన్న కొన్ని సెకన్ల పాటు మేజిస్ట్రేట్‌ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వివరాలన్నీ వాంగ్మూలంలో నమోదయ్యాయి.

సీబీఐ చేతికి దస్తగిరి వాంగ్మూలం..

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్‌ దస్తగిరి వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు కోర్టు ద్వారా బుధవారం అందుకున్నారు. వాంగ్మూలంలో పేర్కొన్న వివరాల ఆధారంగా సీబీఐ అధికారులు విచారణ చేపట్టి.. మరికొందరు నిందితులను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 21న మరోమారు పులివెందుల మేజిస్ట్రేట్‌ ఎదుట దస్తగిరి వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. తాజా వాంగ్మూలంలో పేర్కొన్న వ్యక్తులపై ఆధారాలు లభిస్తే సీబీఐ మరిన్ని అరెస్టులు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

వారిని ఎందుకు విచారించడం లేదు...?

వివేకా హత్య కేసులో అయిదో నిందితుడు శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ పులివెందుల కోర్టులో ఈ నెల 21న పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌లో వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, తెదేపా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి తదితరుల పేర్లను అనుమానితుల కింద ఆమె పేర్కొన్నారు. పిటిషన్‌ వివరాలను బుధవారం విడుదల చేశారు. సీబీఐ అధికారులు కేసును ఏకపక్షంగా దర్యాప్తు చేస్తున్నారని, మరో కోణంలో విచారణ చేయట్లేదని ఆరోపించారు. అసలైన నిందితులను కాకుండా.. కేసుతో సంబంధంలేని తన భర్తను సీబీఐ అరెస్టు చేసిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, ఆయన సోదరుడు శివప్రకాష్‌రెడ్డి, తెదేపా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, కొమ్మా పరమేశ్వర్‌రెడ్డి, వై.జి.రాజేశ్వర్‌రెడ్డి, నీరుగట్లు ప్రసాద్‌ను అనుమానితులుగా చేర్చారు. ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల గొడవ కారణంగానే వివేకా హత్య జరిగి ఉంటుందని పేర్కొన్నారు. ఈ కోణంలో సీబీఐ దర్యాప్తు చేయకుండా.. ఏకపక్షంగా చేస్తోందని ఆరోపించారు. వివేకా రెండోపెళ్లి చేసుకున్నారని, ఓ కొడుకు పుట్టిన విషయం అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. బెంగళూరులో భూమి సెటిల్‌మెంట్‌ ద్వారా వచ్చిన డబ్బుల్లో రూ.2 కోట్లు రెండో భార్యకు ఇస్తానని వివేకా చెప్పారని, కొంత ఆస్తి కూడా ఆమె పేరిట రాశారని వివరించారు. ఈ విషయమై వివేకాకు... కుటుంబసభ్యులకు గొడవలు ఉన్నాయని, ఈ కారణంగానే ఆయన భార్య సౌభాగ్యమ్మ హైదరాబాద్‌లో కూతురు సునీత వద్ద ఉన్నట్లు తెలిపారు. రెండో భార్యను అల్లుడు పలుమార్లు బెదిరించారని, ఈ విషయంలో పెద్ద వివాదమే ఉన్నట్లు పేర్కొన్నారు. - శివశంకర్‌రెడ్డి భార్య

ఇదీ చదవండి:

Viveka Murder Case: వివేకా హత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.